అలర్ట్: పీఎఫ్ ఖాతా ఉంటే రూ.80వేలు.. అసలు విషయం ఇదే!

  • Published By: vamsi ,Published On : November 4, 2019 / 02:55 AM IST
అలర్ట్: పీఎఫ్ ఖాతా ఉంటే రూ.80వేలు.. అసలు విషయం ఇదే!

Updated On : November 4, 2019 / 2:55 AM IST

రాను రానూ సైబర్ క్రైమ్‌లు ఎక్కువగా అయిపోతున్నాయి. చదువుకున్నోళ్లు, చదువు లేనోళ్లు, ఉద్యోగులు ఒకరనేం లేదు. ప్రతి ఒక్కరు కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు వారి ఉచ్చులో పడిపోతున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఆలోచనలు, ఎత్తులు వేసి మోసం చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యమైన గమనిక ఇచ్చింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ). 

ఈ మేరకు ఈపీఎఫ్‌వో తన సబ్‌స్క్రైబర్లను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బంపర్‌ అఫర్‌అంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని, దానిని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు వెల్లడించాలంటూ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో తెలియని కొంతమంది ఈపీఎఫ్ ఖాతాదారులు లింక్‌లో లాగిన్ అయ్యి వివరాలు చెప్పి మోసపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేయగా.. అధికారులు స్పందించారు.

ఇది ఫేస్‌ న్యూస్‌ అని, ఇలాంటి పుకార్లను నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. అలాగే ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ  కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించకండి ఖాతాదారులను హెచ్చరించింది ఈపీఎఫ్ సంస్థ. ఈ మేరకు అధికారిక ట్విటర్‌ ద్వారా ఓ మెసేజ్ పెట్టింది. ఇలాంటి సత్యదూరమైన మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని  సూచించింది. తామెలాంటి ఆఫర్లను అందింట్లేదని స్పష్టం చేసింది.