Bharat Biotech : భారత్ బయోటెక్ ప్లాంట్‌కు కేంద్ర భద్రత
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ "కోవాగ్జిన్" తయారీదారు భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

Bharat Biotech
Bharat Biotech యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ “కోవాగ్జిన్” తయారీదారు భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్ ఇకపై సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించనుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) లోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి
శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం..ప్లాంట్‌ను తమ అధీనంలోకి తీసుకోనుంది.
దేశం యొక్క వైద్య మరియు ఆరోగ్య భద్రత నిర్ధారణలో ఈ సంస్థ ఒక ముఖ్యమైనది. ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొంటుంది. కాబట్టి హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించనుందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Read:Corona Vaccine : వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పాలు ఇవ్వొచ్చు, నిపుణుల స్పష్టత