Bhargavastra: ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే..?

డ్రోన్ల దండును ఎదుర్కోవడానికి భారతదేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి సూక్ష్మ క్షిపణి వ్యవస్థ.

Bhargavastra: ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే..?

Bhargavastra micro missiles

Updated On : May 14, 2025 / 4:05 PM IST

Bhargavastra micro missiles: ప్రత్యర్థుల నుంచి వచ్చే డ్రోన్ల దండును కట్టడి చేసేలా భార్గవాస్త్రను భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘భార్గవాస్త్ర’ను సోలార్‌ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్‌) రూపొందించింది. ఈ కౌంటర్-డ్రోన్ వ్యవస్థలో ఉపయోగించిన మైక్రో రాకెట్‌లు గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించారు. అన్ని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాయి.

Also Read: Operation Sindoor: భారత్‌పై దాడికి టర్కీ పెద్ద ప్లానే వేసింది..! డ్రోన్లతోపాటు సైనికులు కూడా వచ్చారు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

మంగళవారం భారత సైన్యం సీనియర్ అధికారుల సమక్షంలో గోపాల్‌పూర్‌లో రాకెట్ కోసం మూడు పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా రెండు పరీక్షలు నిర్వహించారు. రెండు సెకన్లలోపు రెండు రాకెట్లను సాల్వో మోడ్ లో పేల్చడం ద్వారా ఒక ట్రయల్ నిర్వహించారు. నాలుగు రాకెట్లు ఆశించిన విధంగా పనిచేశాయని, అవసరమైన ప్రయోగ పరిమితులను సాధించాయని, పెద్దఎత్తున డ్రోన్ల దాడుల ప్రభావాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేశాయని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు సర్వంసిద్ధం.. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే పుష్కరాలు.. ఇక్కడ విశిష్ఠత ఏమిటంటే..? పురాణాల ప్రకారం..

భార్గవాస్త్ర సూక్ష్మ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి?
♦ డ్రోన్ల దండును ఎదుర్కోవడానికి భారతదేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి సూక్ష్మ క్షిపణి వ్యవస్థ.
♦ ‘భార్గవస్త్ర’ అనే కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ఆరు కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ఉన్న చిన్న వైమానిక వాహనాలను గుర్తించి, గైడెడ్ మైక్రో మందుగుండు సామగ్రిని ఉపయోగించి వాటిని నియంత్రిస్తుంది.
♦ భార్గవస్త్ర వ్యవస్థ 64 కంటే ఎక్కువ మైక్రో క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
♦ ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ ఈ మొబైల్ ప్లాట్‌ఫామ్-మౌంటెడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది ముప్పు ఉన్న ప్రాంతాలకు త్వరగా మోహరించడానికి వీలుంటుంది.
♦ ఎత్తైన ప్రాంతాలతో, వివిధ భూభాగాలలో తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది.
♦ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ఇది.