Bhopal HUT Case : భోపాల్ హెచ్ యూటీ కేసులో సంచలన విషయాలు.. కోడ్ లాంగ్వేజ్ గా బిర్యానీ, లడ్డు పదాలు

ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు.

Bhopal HUT Case : భోపాల్ హెచ్ యూటీ కేసులో సంచలన విషయాలు.. కోడ్ లాంగ్వేజ్ గా బిర్యానీ, లడ్డు పదాలు

Bhopal HUT Case

Updated On : May 19, 2023 / 3:38 PM IST

Bhopal HUT Case Sensational Things : భోపాల్ హెచ్ యూటీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బిర్యానీ, లడ్డు అనే పదాలను నిందితులు కోడ్ లాంగ్వేజ్ గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిగాయి. జూమ్ యాప్ లో నిందితులు సమావేశాలు నిర్వహించారు. మోతిలాల్ నెహ్రూ స్టేడియం వద్ద రెక్కీ నిర్వహించారు.

దాడుల్లో జీహద్ సాహిత్యం, టెక్నికల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఎంతో మంది యువత హెచ్ యూటీలో జాయిన్ అయ్యారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడంతో పాటు వాటిని పేల్చేందుకు నిందితులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

Hyderabad Terror Conspiracy : హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు

ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వస్తున్న వాయిస్ మెసేజ్ ఆధారంగా చేసుకొని ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. నిందితులు ఎక్కడ ఎలాంటి డిజిటల్ ఎవిడెన్స్ దొరకకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు.