భారీగా డబ్బు ఇస్తాం : బీజేపీ ఆఫర్!

ఎన్నికలవేళ కన్నడనాట జేడీఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జేడీఎస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేశారు. 2018లో తమతో కూటమి కలిసి వస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ చేసిందని ఆరోపించారు.
Read Also : YSRCP అధికారంలోకి వస్తే : 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ – జగన్
ఎన్నికల ఖర్చు నిమిత్తం భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని వస్తే..కుమారస్వామి బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. తన తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు దేవెగౌడ వెల్లడించారు. అంతకుముందు తనన కలవడానికి కూడా బీజేపీ నేతలు ప్రయత్నించారని, అందుకు అంగీకరించలేదని దేవెగౌడ తెలిపారు.
అందుకే బీజేపీ ఇప్పుడు ఐటీ దాడులతో కుట్ర చేస్తుందని, బెదిరించాలని చూస్తుందని చెప్పారు. బెంగళూరులో కర్ణాటక అధికారపార్టీ జేడీఎస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్న క్రమంలో జేడీఎస్, కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన బీజేపీ ఓడేముందు కక్ష తీర్చుకునేందుకే దాడులకు పాల్పడుతోందని అంటున్నారు. ఐటీ శాఖ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ధ్వజమెత్తారు.
Read Also : ఢిల్లీ గులాములు కావాలా.. గులాబీలు కావాలా – KTR