Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా కులాల వారీ గణన చేపట్టాలని వచ్చిన...డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ క్రమంలో నితీశ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

Nitish Kumar
Bihar CM Nitish Kumar : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. కుల గణనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీనిపై ఈ వారాంతంలో అఖిల పక్ష భేటీ జరగనున్నట్లు తెలిపారు. మిత్ర పక్ష బీజేపీతో నితీశ్‌కు మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వస్తోన్న వేళ కుల గణనపై ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కులగణనకు అనుకూలంగా బిహార్ శాసనసభ, శాసనమండలిలో రెండుసార్లు తీర్మానాలు ఆమోదం పొందాయి. అందువల్ల ఈ ప్రక్రియ ప్రారంభించడంలో ఎలాంటి సమస్య లేదన్నారు. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తాయని భావిస్తున్నాయన్నారు. అయితే ఈ నిర్ణయానికి ప్రతిపక్ష ఆర్జేడీ మద్దతునిచ్చింది. కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది.
Presidential Candidate: రాష్ట్రపతి పదవి రేసులో లేనన్న నితీష్ కుమార్
దేశవ్యాప్తంగా కులాల వారీ గణన చేపట్టాలని వచ్చిన…డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ క్రమంలో నితీశ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా నితీశ్ పలు విషయాల్లో బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎన్సార్సీ, ఆర్టికల్ 370 తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నితీశ్ వ్యతిరేకించారు.