బీహార్ డిప్యూటీ సీఎంకి కరోనా

Bihar Deputy CM tests Corona positive బీహార్ డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని తెలిపారు. మెరుగైన చికిత్సకోసం పట్నా ఎయిమ్స్ లో చేరినట్లు ఆయన తెలిపారు. త్వరలో కోలుకొని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు,బీహార్ లో ప్రధాని పర్యటనకు ముందు రోజు..సుశీల్ కుమార్ కు కరోనా పాజిటివ్ అన్న వార్త తెలియడం వల్ల బీజేపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ప్రధాని పాల్గొనే ర్యాలీల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తో కలిసి సుశీల్ పాల్గొంటారని కార్యకర్తలు భావించగా..ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు.
బీహార్ బీజేపీలో ముఖ్యనాయకుడైన సుశీల్ కుమార్ మోడీ…ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.
మరోవైపు,వారం రోజుల్లో తొలి విడత బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఇప్పటికే పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. బీహార్ లో ఈ సారి అధికారం మాదంటే మాది అంటూ జేడీయూ,ఆర్జేడీ ధీమాగా ఉన్నాయి. నవంబర్-10న విడుదలయ్యే ఫలితాలు ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెడతాయే…ఎవరిని విపక్ష స్థానంలో కూర్చోబెడుతుందో చూడాలి మరి.