Bihar election results : సత్తా చూపుతున్న కామ్రేడ్స్

Bihar election results 2020: Left parties look to gain big బీహార్ సమరంలో కామ్రేడ్స్ మెరిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి పోటీ చేసిన వామపక్షాలు (సీపీఐ,ఎంఎల్)అనూహ్యంగా 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వామపక్షాలు ఓటమినే చవిచూశాయి. తమకు పట్టున్న బంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ తమ ప్రాభవాన్ని కోల్పోయి. ఇలాంటి తరుణంలో బిహార్లో కామ్రేడ్లు పుంజుకోవడం వామపక్షాలను పునరుత్తేజాన్నిచ్చేలా కనిపిస్తుంది.
బీహార్ లో మొత్తం 29 స్థానాల్లో వామపక్షాలు పోటీ చేశాయి. సీపీఐ(ఎం) 4, సీపీఐ 6, సీపీఐ (ఎమ్ఎల్) 19 సీట్లలో పోటీ చేశాయి. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్… పార్టీ నేతలు వారించినప్పటికీ వామపక్షాలకు 29 సీట్లను కేటాయించారు. తేజస్వీ నిర్ణయం కూటమికి కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. 2010 బీహార్ ఎన్నికల్లో సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందగా, 2015లో సీపీఐ (ఎమ్ఎల్) కేవలం మూడు చోట్ల గెలుపొందింది. 2020 ఎన్నికల్లో కామ్రేడ్స్ తమ సత్తా చూపిస్తున్నారు.