బీహార్ లో ఎన్డీయే థ్రిల్లింగ్ విక్టరీ!

Bihar Thriller: NDA Ahead, Tight Contest For Single-Largest Party బీహార్ లో ఎన్డీయే కూటమి దాదాపుగా విజయం సాధించింది. ఇక ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. కాగా,ఇప్పటివరకు ఈసీ అధికారికంగా 183 స్థానాల్లో ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించిన 183 స్థానాల్లో…ఎన్డీయే90(బీజేపీ51,జేడీయూ32,వీఐపీ4,హెచ్ఏఎమ్3)స్థానాల్లో విజయం సాధించింది.
మహాఘట్ బంధన్ 86స్థానాల్లో(ఆర్జేడీ60,కాంగ్రెస్14,వాయపక్షాలు12)విజయం సాధించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 4స్థానాల్లో విజయం సాధించింది.బీఎస్పీ 1స్థానంలో,1స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థి గెలుపొందారు.
ఇక,243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని దాటి బీజేపీ లీడింగ్ లో ఉంది. దీంతో బీజేపీ విజయం దాదాపు ఖరారైనట్లే అని చెప్పవచ్చు. అయితే,అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించనుంది. తేజస్వీ యాదవ్ దాదాపుగా బీజేపీకి చెమటలు పట్టించాడనే చెప్పాలి.
ఇప్పటికే పాట్నాసహా బీహార్ లో పలుచోట్ల,ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. బీజేపీ లీడింగ్ లో ఉన్నట్లు తాజా ట్రెండింగ్స్ చూపించడంతో కమలం కార్యకర్తలు పాట్నాలోని పార్టీ ప్రధానకార్యాలయం బయట బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.