Pune : డ్రైవర్ లేకుండానే… బైక్ పరుగులు, అదెలా ?
మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.

Bike Ride
Bike Ride On Road Without Driver : డ్రైవర్ లేకుండానే..వాహనాలు వెళ్లిపోతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆ వాహనాలు ఎలా వెళ్లాయి ? అని ఆలోచిస్తుంటారు. రోడ్డుపై ఇలా వెళుతూ పలు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..మహారాష్ట్ర రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వ్యక్తి లేకుండానే..బైక్ వెళ్లడం చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. ఏకంగా 300 మీటర్లు వెళ్లి…కిందపడిపోయింది.
Read More : New Parliament: వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి పార్లమెంటు కొత్త భవనం సిద్ధం
మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి ఇతరులను అప్రమత్తం చేశాడు.
Read More : Bathing Video : స్నానం చేస్తూ కాబోయే భర్తకు వీడియో పంపాలని అనుకుంది…తర్వాత ఏమైందో తెలుసా ?
అంతలో ఓ జీపు వేగంగా ముందుకు వచ్చింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి..బ్రేక్ వేశాడు. బైక్ దానికి కొద్దిగా ఢీకొని…ఏకంగా టర్న్ తీసుకుంది..కొద్దిదూరం వెళ్లి కిందపడిపోయింది. రోడ్డుపై సుమారు 300 మీటర్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే..బైక్ ఎందుకు అలా వెళ్లిందో…కారణాలు వెల్లడిస్తున్నారు. ఈ బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి వేగంగా నడిపాడని కొంతమంది వెల్లడిస్తున్నారు.
Read More : Simhachalam: సింహాచలంలో కూలిన ధ్వజస్తంభం
ప్రమాదవశాత్తు రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిని ఢీకొనడంతో అతను కిందపడిపోయాడని తెలిపారు. అయితే..బైకర్ కిందపడిపోయినా..బైక్ మాత్రం ముందుకు దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ఘటనలో బైక్ ఢీకొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ లేకుండా..వెళ్లిన బైక్ కు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.