Simhachalam: సింహాచలంలో కూలిన ధ్వజస్తంభం
నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది.

Temple
Simhachalam: నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం(11 ఆగస్ట్ 2021) వేకువ జామున ఆలయంలోని ధ్వజస్తంభం కూలిపోవడంతో ఆలయ నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. సీసీ టీపీ పుటేజీ సహాయంతో కారణాలపై పరిశీలించగా.. ఎవరి ప్రమేయం లేకుండా కూలిపోయిందని, నిర్ధాంచుకుని వివరాలను కనుగొనే ప్రయత్నం చేశారు.
పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలోని కర్ర పుచ్చిపోవడంతో కూలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ సంఘటన 6గంటల 30నిమిషాల సమయంలో జరిగినట్లుగా అధికారులు తెలిపారు. వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు.
పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని ఈవో సూర్యకళ మీడియాకు వివరించారు. 60 ఏళ్లకు చెందిన ధ్వజస్తంభం లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయిందని, త్వరితగతిన కొత్త ద్వజస్తంభం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈఓ. పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.