New Parliament: వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి పార్లమెంటు కొత్త భవనం సిద్ధం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

New Parliament: వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి పార్లమెంటు కొత్త భవనం సిద్ధం

Parliament

New Parliament building: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. శరవేగంగా సాగుతున్న భవన నిర్మాణం అందుబాటులోకి వచ్చేందుకు ఏడాది పడుతుందని స్పీకర్ వివరించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం 1927 లో నిర్మించారని, ఇప్పుడది పాతబడిందని, భద్రతా సమస్యలు, స్థలాభావం, భూకంపాల నుంచి రక్షణలాంటివి లేకుండా పార్లమెంటు నిర్మాణం చెయ్యాలని నిర్ణయించుకుంది.

భారతదేశ కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 971 కోట్ల రూపాయలని, నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భవనం డిజైన్‌ను రూపొందించినట్లు స్పీకర్ చెప్పారు.

మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కొత్త పార్లమెంటు భవనం భారతదేశపు భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా ఆత్మనిర్భర్ భారత్ దేవాలయంలా ఉంటుందని ఓం బిర్లా అభివర్ణించారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.