డిఫాలర్ట వేలకోట్ల రుణాలు మాఫీ…RBI లిస్ట్ లో కీలక విషయాలు

భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నేహితులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారన్న కారణంతోనే పార్లమెంట్ నుంచి ఈ లిస్ట్ ను బీజేపీ దాచిపెట్టిందని రాహుల్ విమర్శించారు. సాకేత్ గోఖలే అనే కార్యకర్త దాఖలు చేసిన RTI దరఖాస్తుకు స్పందనగా… ఆర్బీఐ 50జాబితాను విడుదల చేసిన తర్వాత బీజేపీపై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది.
మంగళవారం(ఏప్రిల్-28,2020)కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో…నేను పార్లమెంట్ లో ఒక సాధారణ ప్రశ్న అడిగాను. 50 మంది అతిపెద్ద బ్యాంక్ స్కామర్ల పేర్లను చెప్పమని అడిగాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు ఆర్బీఐ… నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ మరియు ఇతర బీజేపీ స్నేహితుల పేర్లను లిస్ట్ లో పెట్టింది. ఇందుకే బీజేపీ..పార్లమెంటు ముందు నిజం దాచిపెట్టారంటూ తాను పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
వేల కోట్ల రూపాయలను భారతీయల బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాతో సహా 50 మంది ఎగవేతదారుల 68,607 కోట్ల రూపాయల రుణాలను మోడీ సర్కార్ “మాఫీ” చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 నుండి 2019 సెప్టెంబర్ వరకు రూ .6.66 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఆర్టీఐ సమాధానం ప్రకారం…దేశంలోని అగ్ర రుణ ఎగవేతదారుల జాబితాను కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విడుదల చేశారు. వారి రుణాలు ఎందుకు మాఫీ చేశారనే దానిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది డూప్‌ను ప్రోత్సహించే క్లాసిక్ కేసు అని, మోసం మరియు నిష్క్రమణ” విధానాన్ని ప్రోత్సహించే మోడీ ప్రభుత్వ పాలసీ అని, దీనిని ఇకపై అంగీకరించలేమ ని,ప్రధాని సమాధానం చెప్పాలని అని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో అన్నారు. ఇది మోడీ ప్రభుత్వం యొక్క… తప్పుగా భావించిన ప్రాధాన్యతలను మరియు నిజాయితీ లేని ఉద్దేశాలను ప్రతిబింబిస్తుందని సుర్జేవాలా అన్నారు.
కాగా, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ 10 లక్షల కోట్లకు పైగా చెడ్డ అప్పుల్లో(bad debt) కూరుకుపోతోందని ఓ వార్తా కథనం తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకోవడానికి బిలియనీర్లు దేశం నుండి పారిపోతున్న అనేక సంఘటనలు మరియు హై ప్రొఫైల్ ఇనిస్టిట్యూషన్స్ లో వినాశకరమైన ఆర్థిక సంక్షోభాలు అధికంగా ఉన్నాయి