సీఏఏకు మద్దతు కూడగట్టేందుకు…టోల్ ఫ్రీ నెంబర్ లాంఛ్ చేసిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 2, 2020 / 11:59 AM IST
సీఏఏకు మద్దతు కూడగట్టేందుకు…టోల్ ఫ్రీ నెంబర్ లాంఛ్ చేసిన బీజేపీ

Updated On : January 2, 2020 / 11:59 AM IST

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి దేశ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఓ వైపు దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన స్ట్రాటజీని మారుస్తూ వస్తుంది. ఇప్పటికే 30వేల మంది వాలంటీర్లను వెస్ట్ బెంగాల్ కు పంపి..వారి ద్వారా ప్రతిఒక్కరికి సీఏఏ చట్టం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పాలని నిర్ణయించిన బీజేపీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సీఏఏకు ప్రజల మద్దతు కూడగట్టే ప్లాన్ లో భాగంగా బీజేపీ గురువారం(జనవరి-2,2019)ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను లాంఛ్ చేసింది. జనవరి-5నుంచి 15 వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా  సీఏఏను సమర్థించేవాళ్లు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్డ్ కాల్ ద్వారా తమ ఆమోదాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చుని బీజేపీ జనరల్ సెక్రటరీ అనిల్ జైన్ తెలిపారు. జనవరి-5నుంచి 15వరకు జరిగే ఈ డ్రైవ్ సమయంలో పార్టీలోని ముఖ్యనేతలు,కేంద్రమంత్రులు,సీనియర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి సీఏఏ గురించి ప్రజలకు వివరిస్తారని ఆయన తెలిపారు. అంతేకాకుండా సీఏఏకు మద్దతు తెలిపేవారు సోషల్ మీడియా ద్వారా కూడా తమ వాయిస్ ను వినిపించాలని ఆయన తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి పార్టీ నాయకులు ఇప్పటికే బహిరంగ సమావేశాలు మరియు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారని అనిల్ జైన్ అన్నారు. సీఏఏ గురించి కాంగ్రెస్,ఇతర పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.