BJP MLA: బీజేపీ ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన గ్రామస్థులు
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. ఖతౌలీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ సైనీ మీటింగ్ కోసమని బుధవారం గ్రామానికి వచ్చారు.

Bjp Mla
BJP MLA: ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. మీటింగ్ కోసమని బుధవారం గ్రామానికి వచ్చిన ఖతౌలీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ సైనీ పారిపోయారు. అతనిపై ఎప్పటి నుంచో కోపంతో ఉన్న గ్రామస్థులు కారును వెంబడిస్తూ పరుగులు తీయించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో సైనీ.. అతని కారు వెనుక పరుగులు పెడుతున్న జనం.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రైతు చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వమంటూ ఆరోపిస్తూ.. సంవత్సర కాలం ఉద్యమం చేయాల్సి వచ్చిందంటూ నినాదాలు చేస్తూ కారుపైకి ఎగబడ్డారు.
అంతేకాకుండా మర్యాదగా రాజీనామా చేయమని.. అరుస్తూ వెంటబడటంతో చేతులు జోడించి దండంపెడుతూ సొంత నియోజకవర్గం నుంచే పరరయ్యారు ఎమ్మెల్యే.
ఇది కూడా చదవండి : భారతీయ యువకుడిని అపహరించిన చైనా ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.