Ravi Kishan Daughter: అగ్నిపథ్ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్‌లో చేరిన బీజేపీ ఎంపీ కుమార్తె ఇషితా శుక్లా
బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా డిఫెన్స్ ఫోర్స్‌లో భాగమైంది. ఇషితా శుక్లాకు 21ఏళ్లు. ఆమె రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ‘అగ్నివీర్’ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్‌లో భాగమైంది.

Ravi Kishan daughter Ishita Shukla,
Ravi Kishan Daughter: బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ (Ravi Kishan) కుమార్తె ఇషితా శుక్లా (shita Shukla) డిఫెన్స్ ఫోర్స్ (Defense Force) లో భాగమైంది. ఇషితా శుక్లాకు 21ఏళ్లు. ఆమె రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ‘అగ్నివీర్’ పథకం (gniveer scheme) కింద డిఫెన్స్ ఫోర్స్‌లో భాగమైంది. ఈ ఏడాది ప్రారంభంలో రవికిషన్ తన కుమార్తె డిఫెన్స్ ఫోర్స్‌లో చేరాలనే కోరికను వ్యక్తం చేశాడు. జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో, ఢిల్లీ డైరెక్టరేట్‌లోని సెవెన్త్ గర్ల్స్ బెటాలియన్ క్యాడెట్‌లలో ఇషిత భాగమని, ఆ రోజు పరేడ్‌లో పాల్గొందని రవిషన్ చెప్పారు. తాజాగా తన కుమార్తె డిఫెన్స్ ఫోర్స్‌లో భాగమైన విషయాన్ని రవికిషన్ ధృవీకరించారు.

Ravikishna daughter ishita
ఇషితా శుక్లాకు 21 సంవత్సరాలు. ఢిల్లీ యూనివర్సిటీ రాజధాని కాలేజీలో చదివింది. ఇషిత ఎన్‌సీసీలో క్యాడెట్‌గా ఉన్నారు. ఆమెకు 2022 సంవత్సరంలో ఎన్‌సీసీ ఏడీజీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ లభించింది. ఆమెకు కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బెస్ట్ క్యాడెట్ అవార్డును అందించారు. ఇషితా శుక్లా ఇన్ స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమె ప్రొఫైల్‌లోని అనేక పోస్ట్‌లు దేశానికి సేవ చేయడం పట్ల ఆమెకున్న అభిరుచి, అంకితభావాన్ని తెలియజేస్తుంటాయి. ట్రావెలింగ్ తో పాటు ఇండోర్ షూటింగ్‌లంటే ఆమెకు చాలా ఇష్టం. రవి కిషన్ తన 21ఏళ్ల కుమార్తె గురించిన వార్తలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. దీంతో ఇషిత సాధించిన ఘనత పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
— Ravi Kishan (@ravikishann) June 28, 2023