Pragya Thakur: హిందువులు కత్తులు వాడాలంటూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ సాధ్వీపై కేసు
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవసరం వస్తుందో ఎవరికి తెలుసు? తమను తాము రక్షించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది

BJP MP Pragya Thakur Named In Police Case For Keep Knives Speech
Pragya Thakur: హిందువులు ఇళ్లల్లో కత్తులు పదును చేసుకొని పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు అయింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో హిందూ జాగరణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ భారత వార్షిక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన విధ్వేష వ్యాఖ్యలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Naxals Leader Surrendered : పోలీసులకు లొంగిపోయిన నక్సల్స్ కీలక నేత.. అతని తలపై రూ.19 లక్షల రివార్డు
ఆ కార్యక్రమంలో ప్రగ్యాసింగ్ మాట్లాడుతూ ‘‘లవ్ జిహాద్ పేరుతో వారికి జిహాద్ అనే ఒక సంప్రదాయం ఉంది. వాళ్లు ప్రేమ పేరుతో జిహాద్ చేయరు. జిహాద్ పేరుతో ప్రేమిస్తారు. మనం (హిందువులు) కూడా ప్రేమిస్తాం. మనం భగవంతుడిని ప్రేమిస్తాం. ఒక సన్యాసి భగవంతుడిని ప్రేమిస్తారు. దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములందరినీ అంతం చేయాలని సన్యాసి చెప్పారు. లేదంటే ఇక్కడ నిజమైన ప్రేమకు నిర్వహనం ఉండదు. అందుకే వారికి సమాధానం చెప్పాలి. లవ్ జిహాద్ పేరుతో మోసపోకుండా మీ అమ్మాయిలను రక్షించండి. వారికి సరైన విలువలు నేర్పండి’’ అని అన్నారు.
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవసరం వస్తుందో ఎవరికి తెలుసు? తమను తాము రక్షించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా మనపైకి దాడికి ప్రయత్నిస్తే వారికి తిరిగి అదే స్థాయిలో జవాబు ఇవ్వడం కూడా హక్కు కిందే’’ అని ప్రగ్యాసింగ్ అన్నారు.