JP Nadda: జేపీ నడ్డా తర్వాత బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ఎప్పుడు తేలనుందో తెలుసా?
బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డా అధ్యక్షతన సంఘటన్ పర్వ్ వర్క్‌షాప్ జరిగింది.

జేపీ నడ్డా తర్వాత బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ఈ కీలక బాధ్యతల్లో ఎవరు ఉండాలని బీజేపీ కోరుకుంటోంది? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రానుంది.
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జనవరి చివరి నాటికి పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనవరి 15 నాటికి రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డా అధ్యక్షతన సంఘటన్ పర్వ్ వర్క్‌షాప్ జరిగింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 25 వరకు సంవత్సరం పాటు అటల్ జయంతిని సంవిధాన్ పర్వ్ గా జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణకు కౌంటర్‌గా పార్టీ సంఘటన్ పర్వ్‌ను జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
PDS Rice Case : భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు- పేర్ని నానిపై మంత్రి కొల్లు ఫైర్