PDS Rice Case : భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు- పేర్ని నానిపై మంత్రి కొల్లు ఫైర్
ఇప్పటికే గోడౌన్ లో 7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు పోలీసులు.

PDS Rice Case
PDS Rice Case : మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మానస తేజ ఇచ్చే స్టేట్ మెంట్ ఈ కేసులో ఎంతో కీలకం కానుందని పోలీసులు తెలిపారు. అతడి స్టేట్ మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయం..
ఇప్పటికే గోడౌన్ లో 7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఏ-1గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు ఇవ్వనుంది జిల్లా కోర్టు. ఇక, ఇదే కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుకి నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు.
Also Read : గతం మర్చిపోయావా..? మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు- పేర్ని నానిపై మంత్రి కొల్లు ఫైర్
మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. పేర్నినానికి నిద్ర లేని రోజులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. బియ్యం దొంగ పేర్ని నాని తప్పించుకోలేరని ఆయన అన్నారు. భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పేర్ని నాని దొంగతనంగా అమ్ముకున్నారని ఆరోపించారు. పేర్నినాని తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Ration Rice
బియ్యం కుంభకోణంలో పేర్ని నాని ప్రధాన సూత్రధారి అని ఆయన ఆరోపించారు. 7వేల 577 బస్తాల పేదల బియ్యం తిని.. పేర్ని నాని నీతి కబుర్లు చెబుతున్నాడని ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర. తప్పు చేశారు కాబటే నెల రోజులుగా పేర్ని నాని తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పారు. మహిళలను అరెస్ట్ చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను వారించినట్లు పేర్ని నాని చెప్పడం పెద్ద జోక్ అన్నారు కొల్లు రవీంద్ర. భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గు చేటని విమర్శించారు.
ఇళ్ల స్థలాల పేరుతో 450 ఎకరాల భూ స్కామ్ కు పేర్ని నాని పాల్పడలేనా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. త్వరలోనే పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ ఉంటుందన్నారు. అవినీతికి పాల్పడిన పేర్ని నాని, ఆయన అనుచరులను వదిలి పెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర తేల్చి చెప్పారు.
Also Read : తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో బొత్స కీలక భేటీ