BJP Election Expenditure : 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే…

BJP Election Expenditure : 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే…

BJP Election Expenditure

Updated On : August 18, 2023 / 9:14 AM IST

BJP Election Expenditure : గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల ప్రచార వ్యయం చూస్తే షాకవుతారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి, అభ్యర్థుల నిధుల కోసం రూ.209.97 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సాక్షాత్తూ ఆ పార్టీనే వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు బీజేపీ అధికారికంగా సమర్పించిన వ్యయ నివేదికలో తెలిపింది. (BJP spent over Rs 209 crore)

IndiGo pilot collapses : నాగపూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో ఇండిగో పైలట్ మృతి

గుజరాత్ రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల ప్రచారానికి భారీ మొత్తాన్ని వెచ్చించడం విశేషం. ( 2022 Gujarat assembly polls) గత ఏడాది డిసెంబర్‌ నెలలో జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు బీజేపీ రూ.41 కోట్లు చెల్లించింది.

Terrorist Yasin Malik’s Wife : పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు మంత్రి పదవి

విమానాలు, హెలికాప్టర్ల వినియోగంతో సహా ప్రయాణ ఖర్చుల కోసం రూ.15 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బీజేపీ తెలిపింది. సాధారణ పార్టీ ప్రచారానికి రూ.160.62 కోట్లు ఖర్చు చేశామని బీజేపీ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వ్యయ నివేదికలో తెలిపింది.

Earthquake : కొలంబియన్ రాజధానిలో భారీ భూకంపం

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ చేసిన ఎన్నికల వ్యయ నివేదికను ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్ లో పెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఆర్భాటంగా ముమ్మర ప్రచారం చేసింది. కాని భారీగా చేసిన ఎన్నికల వ్యయం నివేదికల్లో మాత్రం నామమాత్రంగా ఉందని ఓటర్లు అంటున్నారు.