దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్…శివరాజ్ సర్కార్ సేఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2020 / 08:03 AM IST
దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్…శివరాజ్ సర్కార్ సేఫ్

Updated On : November 11, 2020 / 10:47 AM IST

BJP Sweeps Assembly Bypolls In 11 States దేశవ్యాప్తంగా కమలాలు విరబూశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యంగా, మధ్యప్రదేశ్‌లో అత్తెసరు మెజారిటీతో కొనసాగుతున్న శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వానికి ఉపఎన్నికల ఫలితాలు సంపూర్ణ బలాన్నిచ్చాయి.



ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్‌ నుంచి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 25మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించటంతో రాష్ట్రంలో ఈ నెల 3న 28స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 28 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా, 19 స్థానాల్లో బీజేపీ గెలిచింది. శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వానికి ప్రస్తుతం 107మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యులు అవసరం. తాజా విజయంతో చౌహాన్‌ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీ (126 స్థానాలు) సాధించింది.



ఇక, తెలంగాణలో దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై వెయ్యికిపైగా ఓట్ల తేడాతో రఘునందన్ రావు విజయం సాధించారు.



మరోవైపు,గుజరాత్ లో 8 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో…మొత్తం 8సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే సిట్టింగ్‌ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన 8 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. దీంతో గత అసెం‍బ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది.

ఉత్తరప్రదేశ్ లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా,6స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఒక్క స్థానంలో బీఎస్పీ గెలిచింది.
https://10tv.in/madhya-pradesh-bypoll-results-bjp-wins-1-seat-leading-on-19-congress-ahead-on-7/
కర్ణాటకలో రెండు నియోజకరవ్గాలు.. సిర్సా,ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. మణిపూర్ లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగుస్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.