Delhi New CM : కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం.. 19న ఢిల్లీ కొత్త సీఎం ఎవరో తేలిపోనుంది!
Delhi CM : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 20న చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో, బీజేపీ శాసనసభా పార్టీ సభా నేతను ఎన్నుకోనుంది.

BJP to Announce Delhi Chief Minister Tomorrow
Delhi New CM : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరుపై ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 20వ తేదీన రాంలీలా మైదానంలో జరగనుంది. ఇందుకోసం సన్నాహాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.
Read Also : AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా..!
ఇదిలా ఉండగా, ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్ష మంది ఢిల్లీ వాసులను ఆహ్వానించాలని బీజేపీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో ఈ నెల 19న (బుధవారం) మధ్యాహ్నం బీజేపీ ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 3గం.లకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. పార్టీ అగ్ర నాయకత్వం శాసనసభ పార్టీ సమావేశానికి హాజరు కానుంది.
19న ఢిల్లీ కొత్త సీఎం పేరు ఖరారు :
రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి సంతకం చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6.40 గంటలకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశం ప్రారంభమవుతుంది. ఈ శాసనసభా పక్ష సమావేశంలోనే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది. ఎల్లుండి (20న) ఉదయం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి, మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది.
రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం :
రాంలీలా మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలందరిని బీజేపీ ఆహ్వానించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి సహా కేంద్ర కేబినెట్ మంత్రులంతా హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపింది. ఈ నెల 20న ఉదయం 11గంటల నుంచి 12గంటల మధ్య ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
Read Also : AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా..!
సీఎం రేసులో ఎవరంటే? :
ఢిల్లీ సీఎం రేసులో రేఖా గుప్తా, పర్వేశ్ వర్మ, ఆశీష్ సూద్ ముందు వరుసలో ఉన్నారు. గత జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ 48 స్థానాల్లో భారీ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ ఎల్ఓపీ సమావేశంలో ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించనున్నారు.