AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా..!
AP Cabinet Meeting : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేఫథ్యంలోనే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.

AP Cabinet Meeting
AP Cabinet Meeting : ఈనెల 20న జరగాల్సిన ఏపీ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడునుంది.
ఈ సందర్భంగా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేఫథ్యంలోనే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మళ్లీ కేబినెట్ మీటింగ్ ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారం లేదు.
ఢిల్లీ టూర్ షెడ్యూల్ ప్రకారం.. సీఎం చంద్రబాబు ఆరోజు ఉదయం 9:45 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఆయన విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:30కు ఢిల్లీ చేరుకోనున్నారు.
అనంతరం ఒంటిగంటకు జనపద్‌కు సీఎం చేరుకుంటారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
Read Also : Gold Rush : లండన్ నుంచి న్యూయార్క్‌కు బిలియన్ల బంగారం.. బ్యాంకులు ఎందుకు తరలిస్తున్నాయంటే? అసలు రీజన్ ఇదే!
గత జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ 48 స్థానాల్లో భారీ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ ఎల్ఓపీ సమావేశంలో ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించనున్నారు.