Gold Rush : లండన్ నుంచి న్యూయార్క్‌కు బిలియన్ల బంగారం.. బ్యాంకులు ఎందుకు తరలిస్తున్నాయంటే? అసలు రీజన్ ఇదే!
Gold Rush : ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ, యూరోపియన్ దిగుమతులపై అమెరికా సుంకాల భయాలు న్యూయార్క్‌లో ధరల పెరుగుదలకు దారితీశాయి.

Why banks are flying gold worth billions from London
Gold Rush : బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దిగుమతులపై సుంకాలు విధించడంపై ఆందోళనలు నేపథ్యంలో న్యూయార్క్, లండన్ మధ్య ధరల్లో భారీగా వ్యత్యాసానికి దారితీశాయి. అట్లాంటిక్ అంతటా అసాధారణ ధరల అంతరంతో ప్రపంచ దిగ్గజ బ్యాంకులైన జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ వాణిజ్య విమానాలలో బిలియన్ల విలువైన బంగారాన్ని స్వదేశానికి తరలిస్తున్నాయి.
న్యూయార్క్‌లో బంగారం ధరలు పెరుగుదల ఎందుకంటే? :
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దిగుమతులపై సుంకాలు విధిస్తారనే భయాలు న్యూయార్క్‌లో బంగారం ధరల పెరుగుదలను సృష్టించాయి.
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. సంభావ్య వాణిజ్య పరిమితులపై ఆందోళనలతో లండన్ కన్నా అమెరికాలో బంగారం ధరను భారీగా పెంచేశాయి. న్యూయార్క్‌లోని కమోడిటీ ఎక్స్ఛేంజ్ (కామెక్స్)లో ఫ్యూచర్స్ ఔన్సుకు 20 డాలర్లకు ఎక్కువగా ట్రేడవుతున్నాయి.
రాయిటర్స్ ప్రకారం.. ఈ సంవత్సరం బంగారం ధరల్లో 8 రికార్డు గరిష్టాలను తాకింది. ఫిబ్రవరి 11న ఔన్సుకు 2,942.70 డాలర్లకి చేరుకున్నాయి. గోల్డ్‌మన్ ఇప్పుడు 2025 చివరి నాటికి బంగారం ఔన్సుకు 3,100 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
లండన్ నుంచి న్యూయార్క్‌కు బంగారం ఎందుకంటే? :
లండన్, న్యూయార్క్ మధ్య ధరల అంతరం కారణంగా జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులకు సవాలుగా మారింది. జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ వంటి బ్యాంకులు లండన్‌లో పెద్ద బులియన్ నిల్వలను కలిగి ఉన్నాయి. తరచుగా ఈ బంగారాన్ని ఇతర వ్యాపారులకు అప్పుగా ఇస్తాయి.
అయితే, ఈ ఆర్థిక సంస్థలు న్యూయార్క్‌లో బంగారు ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయించినందున అమెరికాలో పెరుగుతున్న బంగారం ధర నష్టాల ప్రమాదంలో పడేసింది. ఫ్యూచర్స్ కాంట్రాక్టులను అధిక ధరకు తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, ఈ బ్యాంకులు లండన్ నుంచి న్యూయార్క్‌కు భౌతికంగా బంగారాన్ని తరలించాలని నిర్ణయించుకున్నాయి. లండన్ ధరలతో పోలిస్తే న్యూయార్క్‌లో బంగారాన్ని ప్రీమియం ధరలకు అమ్ముకోవచ్చు.
ఎంత బంగారాన్ని తరలిస్తున్నాయంటే? :
ఈ నెలలో జేపీ మోర్గాన్ ఒక్కటే 4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించాలని యోచిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. కచ్చితమైన గణాంకాలు వెల్లడి కాలేదు. హెచ్ఎస్‌బీసీ కూడా గణనీయమైన మొత్తంలో బంగారాన్ని న్యూయార్క్‌కు తరలిస్తోంది.
బంగారాన్ని ఎలా రవాణా చేస్తారు? :
వాణిజ్య విమానాల్లో రవాణ అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నది. సురక్షితమైన రవాణా విధానం కావడంతో బంగారాన్ని ఈ మార్గంలోనే తరలిస్తున్నారు. ఖజానాల నుంచి బంగారం బయటకు తీసిన తర్వాత, భద్రతా సంస్థలు సాయుధ వ్యాన్లలో విమానాశ్రయాలకు రవాణా చేస్తాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. బ్యాంకులు బులియన్‌ను తరలించడానికి ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు.. సురక్షితమైన పద్ధతిగా చెప్పవచ్చు. న్యూయార్క్‌లోని JFK విమానాశ్రయానికి సాధారణ ప్రయాణీకుల విమానాలను ఉపయోగిస్తున్నాయి.
లండన్ నుంచి బంగారాన్ని తరలించడంలో జాప్యం ఎందుకు? :
లండన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఖజానాలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. కానీ, బంగారు వస్తువులకు డిమాండ్ పెరగడంతో, బంగారాన్ని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. గతంలో కొన్ని రోజులు పట్టేది.. ఇప్పుడు 8 వారాల వరకు సమయం పడుతుంది.
ఈ ధోరణి ఇతర వస్తువులపై ప్రభావం చూపుతుందా? :
ట్రంప్ ఇతర లోహాలపై సుంకాలు విధిస్తే.. ఇలాంటి ధరల వ్యత్యాసాలు పెరగవచ్చునని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు.. సుంకాలపై ఆందోళనల కారణంగా అమెరికా కాపర్ ఫ్యూచర్స్ కూడా పెరిగాయని రాయిటర్స్ నివేదించింది. అమెరికా అధ్యక్షుడు గత వారం విదేశీ స్టీల్, అల్యూమినియంపై 25శాతం సుంకం విధించారు. ఈ ధోరణి అలానే కొనసాగితే ప్రపంచ వస్తువుల మార్కెట్లలో మరింత అంతరాయాలకు దారితీయవచ్చు.
Read Also : Gold Rush : లండన్ టు అమెరికా గోల్డ్ రష్.. బంగారం అంతా తరలించేస్తున్నారు!
ఆ తర్వాత ఏం జరగనుంది? :
బంగారం ధరలు అస్థిరంగానే ఉన్నాయి. కానీ, ప్రధాన బ్యాంకులు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్, సిటీ రెండూ తమ బంగారం ధర అంచనాలను పెంచాయి. రాబోయే మూడు నెలల్లో ధరలు ఔన్సుకు 3వేల డాలర్లకు చేరుకుంటాయని సిటీ అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, యూఎస్ వాణిజ్య విధానం రాబోయే నెలల్లో మార్కెట్‌ను రూపొందించే కీలక అంశాలుగా మారనున్నాయి.