JDU on BJP: 1984లో బీజేపీ ఎక్కడుండేదో 2024 ఎన్నికల్లో అక్కడికే వెళ్తుంది
కొద్ది రోజుల క్రితమే ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్.. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అంతేనా.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే పనుల్లో కూడా ఆయన బిజీ బిజీగా ఉన్నారు. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. బీజేపీని ఎదుర్కోవడం ఆ పార్టీ వల్ల కాదనే విమర్శలు ఉన్నాయి.

BJP will drop to 1984 position in next elections says JDU
JDU on BJP: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భవితవ్యంపై రెండు రోజులుగా జేడీయూ జోస్యం చెప్తోంది. ఆ పార్టీకి కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయని జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ శనివారం అనగా.. తాజాగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అయితే కేవలం రెండంటే రెండు స్థానాలే వస్తాయని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ రెండు స్థానాలు బీజేపీ మొదటిసారిగా పోటీ చేసిన 1984 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చినవి. వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ 1984 నాటికి వెళ్తుందని జేడీయూ ఉద్దేశం. ఇక బిహార్ లో 40 స్థానాలు జేడీయూ గెలుచుకుంటుందని ఆయన అనడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితమే ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్.. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అంతేనా.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే పనుల్లో కూడా ఆయన బిజీ బిజీగా ఉన్నారు. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. బీజేపీని ఎదుర్కోవడం ఆ పార్టీ వల్ల కాదనే విమర్శలు ఉన్నాయి. నితీశ్ సైతం కాంగ్రెస్ లేకుండా లేదంటే కాంగ్రెస్ నాయకత్వంలో లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసే పోటీ చేశాయి. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు నితీశ్‌ను ముఖ్యమంత్రి చేశారు. అయితే సీఎం నితీశే అయినా.. పాలన మాత్రం బీజేపీ హైకమాండ్ చేస్తుందనే విమర్శలు అప్పట్లో బాగానే వినిపించాయి. అంతే కాకుండా పొత్తులో ఉన్నామని చూడకుండా బీజేపీ నేతలు తరుచూ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం నితీశ్‌కు బాగా ఆగ్రహాన్ని కలిగించిందట.
Resign: కాంగ్రెస్‌కు మరో షాక్.. రాహుల్ రాకకు ముందే కీలక నేత రాజీనామా