Resign: కాంగ్రెస్‭కు మరో షాక్.. రాహుల్ రాకకు ముందే కీలక నేత రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిన విశ్వనాథ్‌సింగ్ ఏ పార్టీలో చేరే విషయమై స్పష్టతనివ్వలేదు. మిగతావారిలాగే ఈయన కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారమైతే జోరుగానే సాగుతోంది. ఇక దీన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‭పై బీజేపీ నేతలు గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ‘భారత్ జోడో’ అంటూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు ‘కాంగ్రెస్ చోడో’ అనే కార్యక్రమంలో ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

Resign: కాంగ్రెస్‭కు మరో షాక్.. రాహుల్ రాకకు ముందే కీలక నేత రాజీనామా

Vishwanathsinh Vaghela resigns as Gujarat Youth Congress president

Resign: గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్న తరుణంలో విశ్వనాథ్‌సింగ్ రాజీనామా చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కీలక నేత అయిన పాటిదార్ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ కీలక నేతలు పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు.

భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. సెప్టెంబర్ 5న గుజరాత్‭లో పర్యటించనున్నారు. సరిగ్గా రాహుల్ రాకకు ఒక రోజు ముందే విశ్వనాథ్‌సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం అధిష్టానానికి పంపారు. అయితే తాను ఏ పార్టీలో చేరతారనేది స్పష్టం చేయలేదు. మిగతావారిలాగే ఈయన కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారమైతే జోరుగానే సాగుతోంది. ఇక దీన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‭పై బీజేపీ నేతలు గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ‘భారత్ జోడో’ అంటూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు ‘కాంగ్రెస్ చోడో’ అనే కార్యక్రమంలో ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరనున్నాయి. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‭ను 1995 నుంచి భారతీయ జనతా పార్టీయే ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తోంది. అటు ఇటుగా మూడు దశాబ్దాల నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ అదికారాన్ని మాత్రం సాధించలేకపోయింది. రాష్ట్రంలో చిన్నా చితకా ఇతర పార్టీలు ఉన్నప్పటికీ పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే. అయితే పంజాబ్ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న గుజరాత్‭ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధాన పోటీలో నిలబడుతుందా లేదా చూడాలి.

MLAs Return To Ranchi: జార్ఖండ్‭లో హైటెన్షన్.. రాయ్‭పూర్ నుంచి తిరుగు ప్రయాణమైన జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు