నీటిపంప్ లోంచి రక్తం..మాంసం..ఎముకలు: హడలిపోతున్న స్థానికులు 

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 05:19 AM IST
నీటిపంప్ లోంచి రక్తం..మాంసం..ఎముకలు: హడలిపోతున్న స్థానికులు 

Updated On : December 11, 2019 / 5:19 AM IST

నీటి పంప్ లోంచి నీరు రావాలి..కానీ యూపీలోని హమీర్‌పూర్‌లో ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఓ హ్యాండ్‌పంప్ నుంచి  రక్తం..మాసం ముద్దలు..ఎముకలు వస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు హడలిపోతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ పైప్ దగ్గరకు వెళ్లాలంటనే భయపడిపోతున్నారు.  

వివరాల్లోకి వెళితే.. హమీర్‌పూర్ సమీపంలోని జాఖోడీ గ్రామంలో ప్రభుత్వం నీటి పైపులను ఏర్పాటు చేసింది. తాగునీటి కొరత ఉండే ఆ ప్రాంతంలో నీటి పైపు రావటంతో స్థానికులు ఆనంద పడ్డారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పైనుంచి ఎర్రటి రక్తంతో పాటు మాంసం ముద్దలు..ఒక్కోసారి ఎముకలు కూడా వస్తుండటంతోనీటి సమస్య ఎలా ఉన్నాగానీ..వాటిని చూసి హడలిపోతున్నారు. 

జాఖోడీ గ్రామంలో ప్రభుత్వం వంద ఇళ్లకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఈ హ్యాండ్ పంపును ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో ఆ హ్యాండ్ పంప్ నుంచి నీటికి బదులుగా రక్తమాంసాలు వస్తున్నాయి. దీనిని చూసిన గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వాటితో పాటు వచ్చే నీరు కూడా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయం తెలుసుకున్న హమీర్‌పూర్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై విచారణ చేపట్టమని ఎస్డీఎంకు ఆదేశించారు. 

విచారణలో భాగంగా ఆ హ్యాండ్ పంప్‌ను ఓపెన్ చేసి పరిశీలించారు. కానీ రక్తం రావడానికి ప్రత్యేక కారణమేదీ వారికి తెలీలేదు. దీంతో అధికారులు ఆ హ్యండ్ పంప్‌ను మూసివేశారు. ఈ సందర్భంగా ఎస్డీఎం మాట్లాడుతూ..బహుశా దీనికి కారణం హ్యాండ్ పంప్ లోపల పాము మృతిచెంది ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ఇదే విషయం గ్రామస్తులకు చెప్పినా..వారు నమ్మడం లేదని అన్నారు.