Singhu Border : సింఘు వద్ద యువకుడి మృతదేహం, మణికట్టు వద్ద చేయి కట్ చేసి…వేలాడదీశారు
సింఘు సరిహద్దు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ యువకుడి మణికట్టు వద్ద కత్తిరించడమే కాకుండా..బారికేడ్ కు వేలాడదీశారు.

Farmer
Body With Wrist Cut Off : దేశ రాజధాని సింఘు సరిహద్దు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ యువకుడి మణికట్టు వద్ద కత్తిరించడమే కాకుండా..బారికేడ్ కు వేలాడదీశారు. బీభత్సంగా ఉన్న ఈ దృశ్యం అందర్నీ కలిచివేస్తోంది. అసలు ఎవరు చంపారు ? చనిపోయిన వ్యక్తి రైతా ? లేకా మరెవరైనా అనేది తెలియరావడం లేదు. సింఘు సరిహద్దు వద్ద గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన వేదిక వద్దే మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణంగా హత్య ఘటనతో రైతులు నిరసనలు దిగారు. ఈ ఘటనకు టికాయత్ తే బాధ్యత అంటూ బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు.
Read More : Insulin : మోతాదుకు మించి ఇన్సులిన్ ప్రమాదకరమే!…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు ఆందోళన చేపట్టి సంవత్సరం కూడా పూర్తయ్యింది. వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘు ప్రాంతాన్ని ప్రధాన వేదికగా చేసుకుని అక్కడే రైతులు బైఠాయిస్తున్నారు. ఈ క్రమంలో…2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం కనిపించింది. రైతుల ప్రధాన వేదిక వద్ద ఆ వ్యక్తి చేయి కత్తిరించి ఉంది.
Read More : RK Death : నిజమైన విప్లవకారులకు ఆర్కే ఒక ఉదహరణ – కళ్యాణ్ రావు
బారికేడ్ కు మృతదేహం వేలాడి ఉండడం గమనించారు రైతులు. సమాచారం అందుకున్న కుండ్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అతని వయస్సు 35 ఏళ్లు ఉంటుందని, మణికట్టు వద్ద కత్తిరించి దారుణంగా హత్య చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.