కండీషన్ సీరియస్, ఆ సింగర్ కు 4వ సారి కూడా కరోనా పాజిటివ్

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 10:37 AM IST
కండీషన్ సీరియస్, ఆ సింగర్ కు 4వ సారి కూడా కరోనా పాజిటివ్

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా కపూర్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దాంతో అంతా ఆందోళన పడుతున్నారు. వరుసగా నాలుగోసారి కూడా కనికాకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో కనికా సహా డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి కనికా కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో సాధారణంగా ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి కరోనా నెగిటివ్ అని వస్తుందని డాక్టర్లు అంటున్నారు. కానీ కనికా కపూర్ విషయంలో ఇది జరగడం లేదు. నాలుగుసార్లు పరీక్ష చేస్తే అన్నిసార్లు పాజిటివ్ అని రావడంతో కుటుంబ సభ్యులు వర్రీ అవుతున్నారు. కనీసం మెరుగైన వైద్యం కోసం వేరే దేశానికి తీసుకెళ్దామన్నా విమానాలు లేవు. అయినా అమెరికా, ఇటలీ లాంటి దేశాలే కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో కనికాను ఎక్కడికీ తీసుకెళ్లలేని పరిస్థితి.

నాలుగోసారి కూడా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనికా త్వరగా కోలువాలని దేవుడిని ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేకపోతున్నామని వాపోయారు. కనికా కపూర్ శరీరం ట్రీట్ మెంట్ కి స్పందించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, కనికాకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు ఆమె తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఆమె ఒక స్టార్ లా కాకుండా ఒక పేషంట్ లా వ్యవహరిస్తే వైద్యం అందించగలమని డాక్టర్లు స్పష్టం చేశారు. 9 రోజులుగా ట్రీట్ మెంట్ అందిస్తున్నా కనికాను కరోనా వదలడం లేదు. వరసగా నాలుగోసారి పరీక్ష చేసినా పాజిటివ్ రావడం ఆందోళనకరమే అని డాక్టర్లు అంటున్నారు. కనికా హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని చెప్పారు.(కరోనాతో ప్రముఖ సింగర్ మృతి)

మార్చి 9న కనికా కపూర్ లండన్‌ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చింది. లక్నోలో హోటల్‌లో బస చేసింది. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో కలకలం రేగింది. పార్టీలో కనికాను కలిసిన వారు టెన్షన్ పడ్డారు. కనికాను కలిసిన వాళ్లను కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి పంపించారు అధికారులు. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన తల్లి, మాజీ సీఎం వసుంధర రాజే హోం క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

కరోనాపై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘించినందుకు, విదేశాల నుంచి వచ్చాక సెల్ఫ్ క్వారంటైన్ కానందుకు, విదేశీ ప్రయాణ వివరాలు ప్రభుత్వానికి చెప్పకుండా దానినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కనికా కపూర్ వ్యవహారాన్ని యూపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఆమెపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామంది.

Also Read | లాక్ డౌన్ వేళ విషాదం : హైదరాబాద్ లో ఆకలితో వృద్ధుడు మృతి