Airports Bomb Threat : దేశంలోని 40 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు.. భద్రత పెంపు!
Airports Bomb Threat : ఢిల్లీ, పాట్నా, జైపూర్, ఎయిర్ పోర్ట్‌లకు బెదరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్ట్‌లను బాంబులతో పేలుస్తామంటూ దుండగులు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఎయిర్ పోర్ట్‌లో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.

Bomb threat on Dubai-bound flights ( Image Source : Google )
Airports Bomb Threat : దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మొత్తంగా 40 ఎయిర్‌పోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అంతేకాదు.. మంగళవారం (జూన్ 18) చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 286 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్తున్న విమానం తప్పుడు బాంబు బెదిరింపు కారణంగా ఆలస్యమైందని పోలీసులు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం.. విమానంలో బాంబు ఉన్నట్లు ఇమెయిల్ హెచ్చరికను అందుకుంది. దాంతో భద్రతా సంస్థలు మంగళవారం ఉదయం 10:30 గంటలకు బయలుదేరాల్సిన అంతర్జాతీయ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అంతరాయం ఉన్నప్పటికీ, బాంబు బెదిరింపు ముప్పు ఉందనే కారణంతో తనిఖీలను చేపట్టారు. చివరికి విమానం షెడ్యూల్ చేసిన గమ్యస్థానానికి బయల్దేరేందుకు అనుమతించారు.
Read Also : ఘోర ప్రమాదం.. కారు రివర్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి, వీడియో వైరల్
ఢిల్లీలోని పోలీసులు దేశ రాజధానిని ప్రభావితం చేసే మరో బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని వెల్లడించారు. దుబాయ్‌కి బయలుదేరాల్సిన విమానానికి ఈరోజు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9:35 గంటలకు బాంబు బెదిరింపులు అందాయి. ఢిల్లీ, పాట్నా, జైపూర్, ఎయిర్ పోర్ట్‌లకు బెదరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్ట్‌లను బాంబులతో పేలుస్తామంటూ దుండగులు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఎయిర్ పోర్ట్‌లో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
“జూన్ 17 ఉదయం 9:35 గంటలకు, ఢిల్లీ నుంచి దుబాయ్ ఫ్లైట్‌లో బాంబు ఉందని బెదిరింపుతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఆఫీసు, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు ఇమెయిల్ వచ్చింది” అని పోలీసులు పేర్కొన్నారు. బాంబు బెదిరింపు అందిన తరువాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించలేదని అధికారులు వెల్లడించారు.
#WATCH | Bihar: Patna Airport received bomb threat email today; Visuals from outside the airport pic.twitter.com/OBCpyzogA5
— ANI (@ANI) June 18, 2024
గత వారం ఢిల్లీలోని పలు మ్యూజియంలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. చివరికి అది తప్పుడు హెచ్చరికగా నిర్ధారించారు. ఢిల్లీలోని రైల్వే మ్యూజియం సహా దాదాపు 10 నుంచి 15 మ్యూజియంలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు నివేదించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి లొకేషన్లను నిశితంగా పరిశీలించారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తరువాత అధికారులు ఇమెయిల్‌లు బూటకమని ధృవీకరించారు.
మ్యూజియంలలో ఏ పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ఇటీవలి కాలంలో, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలతో సహా దేశ రాజధానిలోని వివిధ సంస్థలు ఇలాంటి బూటకపు బాంబు బెదిరింపులతో లక్ష్యంగా చేసుకున్నాయి. మేలో ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రెండు కాలేజీలకు కూడా తప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి.