Bomb threats: అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లను బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లను బాంబుతో పేల్చేస్తామంటూ నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. అంతేగాక, ముంబైలోని ముకేశ్ అంబానీకి చెందిన ఎంటీలియా భవనాన్ని కూడా పేల్చేస్తామని దుండగుడు చెప్పినట్లు తెలుస్తోంది. నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు కాల్ వచ్చిన వెంటనే ముంబై పోలీసులను వారు అప్రమత్తం చేశారు.

Bomb threats
Bomb threats: బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లను బాంబుతో పేల్చేస్తామంటూ నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. అంతేగాక, ముంబైలోని ముకేశ్ అంబానీకి చెందిన ఎంటీలియా భవనాన్ని కూడా పేల్చేస్తామని దుండగుడు చెప్పినట్లు తెలుస్తోంది. నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు కాల్ వచ్చిన వెంటనే ముంబై పోలీసులను వారు అప్రమత్తం చేశారు.
కాలర్ ను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అది ఒట్టి బెదిరింపు కాలేనా? అన్న విషయంపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు. అమితాబ్ బచ్చన్ కు ముంబైలో అమితాబ్ బచ్చన్ కు 5 లగ్జరీ హౌసులు ఉన్నాయి. “ప్రతీక్ష” భవనంలో గతంలో అమితాబ్ తల్లిదండ్రులు నివసించేవారు. ప్రస్తుతం బచ్చన్ కుటుంబంలోని వారందరూ “జల్సా” అనే లగ్జరీ హౌస్ లో ఉంటున్నారు.
ధర్మేంద్ర జుహూలోని భవనంలో నివసిస్తున్నారు. వాటినే పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. గతంలోనూ సినీ నటుల భవనాలను బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే, అవి నకిలీ బెదిరింపులని పోలీసులు తేల్చారు. మరోసారి బెదిరింపు కాల్ రావడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Malegaon Court: వింతైన తీర్పు ఇచ్చిన మాలేగావ్ కోర్టు.. ముద్దాయి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలట