No lunch break : 12 గంటల పాటు ఏకధాటిగా 80 కేసులను విచారించిన బాంబే హైకోర్టు

బాంబే హైకోర్టు ఏకధాటిగా 12 గంటలపాటు పలు కేసులకు సంబంధించిన వాదనలు విచారించింది. భోజన విరామం కూడా తీసుకోకుండా నిర్విరామంగా 80 కేసుల వాదనలను విన్నది. మధ్యలో కాస్త స్వల్ప టీ బ్రేక్ మాత్రమే తీసుకుంది.

No lunch break : 12 గంటల పాటు ఏకధాటిగా 80 కేసులను విచారించిన బాంబే హైకోర్టు

Bombay Hc 12 Hours To Conduct Hearing (1)

Updated On : May 21, 2021 / 10:11 AM IST

Bombay HC 12 hours to conduct marathon hearing : బాంబే హైకోర్టు ఏకధాటిగా 12 గంటలపాటు పలు కేసులకు సంబంధించిన వాదనలు విచారించింది. భోజన విరామం కూడా తీసుకోకుండా నిర్విరామంగా కేసుల వాదనలు విన్నది. అలా 80 కేసుల వాదనలను వింటూ భోజనం విరామం కూడా తీసుకోకుండా కేవలం మధ్యలో కాస్త స్వల్ప టీ బ్రేక్ మాత్రమే తీసుకుంది. బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం గురువారం (మే 20,2021) ఉదయం 10.45 నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణలను కొనసాగించింది.

ఈ 12గంటల సుదీర్ఘ సమయంలో 80 కేసులను విచారించింది. న్యాయమూర్తులు భోజన విరామం కూడా తీసుకోకుండా వర్చువల్ విధానంలో 80 కేసులకు సంబంధించి వాదనలు విన్నారు. ఉదయం 10.45 గంటలకు విచారణను ప్రారంభించిన జస్టిస్ ఏజే కథావాలా, జస్టిస్ ఎస్‌పీ తావ్డేలతో కూడిన ధర్మాసనం రాత్రి 11.15 గంటల వరకు విచారణలు కొనసాగించింది.

భోజన విరామం కూడా తీసుకోని న్యాయమూర్తులు మధ్యలో మాత్రం కాస్త టీ బ్రేక్ తీసుకున్నారంతే. జస్టిస్ కథావాలా గతంలోనూ ఇలానే సుదీర్ఘంగా విచారణలు కొనసాగించారు. 2018 మేలో వేసవి సెలవులకు ముందురోజు తెల్లవారుజామున 3.30 గంటల వరకు 120 కేసుల్లో వాదనలు విన్నారు. ఇక, నిన్న విచారించిన కేసుల్లో ఎల్గార్ పరిషత్ నిందితుల బెయిల్, చికిత్స, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసు వంటి ముఖ్యమైన కేసులు ఉన్నాయి.