Breakthrough: బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్‌తో ఒమిక్రాన్‌కు చెక్..

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి అంత ప్రమాదం ఉండదు

Breakthrough: బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్‌తో ఒమిక్రాన్‌కు చెక్..

Omicron Scare Dont Panic People About New Variant, Must Be Taken Precautions

Updated On : December 18, 2021 / 10:06 AM IST

Breakthrough: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి అంత ప్రమాదం ఉండదు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే దానిని బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్‌ అని పిలుస్తారు. ఇలా బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ సోకినవారు కొత్త వేరియంట్‌ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

బ్రేక్-త్రూ ఇన్‌ఫెక్షన్ సోకినవారిలో కరోనా కొత్త వేరియంట్లను కూడా ఎదుర్కొనేంత శక్తి ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫైజర్‌ వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజులకు తేలికపాటి ఇన్ఫెక్షన్‌ సోకిన 26 మందిని పరిశీలించిన తర్వాత.. ఈ విషయాన్ని గుర్తించినట్లు ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫికాడు తఫేసీ వెల్లడించారు.

పైజర్‌ వ్యాక్సిన్ తీసుకున్న రెండువారాల తర్వాత విడుదలైన యాంటీబాడీల సంఖ్య కంటే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో వెయ్యి శాతం ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలు విడుదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టా కరోనా వేరియంట్‌పై, ఒమిక్రాన్ వేరియంట్‌లపై ఈ యాంటీబాడీలు బాగా పనిచేస్తాయి.. ఒమైక్రాన్‌ ఆట కట్టించే అవకాశం ఉన్నట్లుగా అర్థం అవుతోంది.