vidaai : అత్తారింటికి కారు నడుపుకుంటూ వెళ్లిన వధువు, వీడియో వైరల్

కన్నీటితో వీడ్కోలు పలుకుతుండగా..తన భర్తతో కలిసి కారు నడుకుంటూ..అత్తారికింటికి వధువు వెళ్లింది.

vidaai : అత్తారింటికి కారు నడుపుకుంటూ వెళ్లిన వధువు, వీడియో వైరల్

Bride drives

Updated On : March 27, 2021 / 4:51 PM IST

Bride drives : సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధుర జ్ఞాపకం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటుంటారు. వివాహంలో ఎన్నో కీలక ఘట్టాలు ఉంటాయి. అందులో అప్పగింతలు ఒకటి. వధువును అత్తాగారింటికి పంపించనప్పుడు భావోద్వేగాలు కనిపిస్తుంటాయి. తమ కూతురికి ఎలాంటి బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు వధువు కుటుంబసభ్యులు కోరుతుంటారు. సాధారణంగా..అత్తారింటికి వెళ్లే సమయంలో..వధువు లేదా వరుడికి సంబంధించిన ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళుతుంటారు. కొంతమంది ఈ అప్పగింతలను వినూత్నంగా నిర్వహించుకుంటుంటారు. అలాంటిదే ఓ వధువు చేసింది. కన్నీటితో వీడ్కోలు పలుకుతుండగా..తన భర్తతో కలిసి కారు నడుకుంటూ..అత్తారికింటికి వధువు వెళ్లింది. మార్చి 10వ తేదీన అప్ లోడ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కోల్ కతాకు చెందిన స్నేహ సింఘి (28) వివాహం..సౌగత్ ఉపాధ్యాయ (29)తో జరిగింది. పెళ్లి అనంతరం అప్పగింతలు (vidaai) నిర్వహించారు. ఎరుపు రంగు లెహెంగా ధరించిన స్నేహ..తన భర్తతో కలిసి బయటకు వచ్చింది. అక్కడనే సిద్ధంగా..పూలతో అలంకరించిన కారు వద్దకు వచ్చారు. అనంతరం డ్రైవర్ సీట్లో స్నేహ కూర్చొగా..పక్కనే సౌగత్ కూర్చొన్నారు. అనంతరం అప్పగింతల పాట, డప్పుల వాయిద్యం నడుమ..మెళ్లిగా కారు నడిపింది స్నేహ. చెమ్మగిల్లిన కళ్లతో…అక్కడున్న వారికి బాయ్ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను స్నేహ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. సరదాగా ఉందని క్యాప్షన్ లో వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1)

Read More : Tamil Nadu Elections: : ఎన్నికల సిత్రాలు, దోశ వేసిన ఖష్బూ…స్మృతి ఇరానీ దాండియా