Brij Bhushan Singh: అమ్మాయిలపై ఆ ఉద్దేశం లేకుండా వారి పల్స్ రేటు చూడడం నేరమేమీ కాదు: బ్రిజ్ భూషణ్
మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ న్యాయవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

WFI
WFI: అమ్మాయిలపై మరో ఉద్దేశమేమీ లేకుండా వారి పల్స్ రేటు చూడడం నేరమేమీ కాదని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోర్టుకు తెలిపారు. మహిళా రెజ్లర్లను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ న్యాయవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కోర్టులో న్యాయవాది భూషణ్ శరణ్ సింగ్ తరఫున తమ వాదనలు వినిపించారు. బ్రిజ్ భూషణ్ పై ఉన్న ఆరోపణలకు ఆధారాలు ఏవీ లేవని చెప్పారు. మహిళా రెజ్లర్ల పల్స్ ను మాత్రమే బ్రిజ్ భూషణ్ చెక్ చేసేవారని తెలిపారు.
ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే పోలీసులు బ్రిజ్ భూషణ్ సింగ్ పై చార్జిషీటు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యూ ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తదుపరి వాదనలను ఈ నెల 19కి వాయిదా వేశారు. కాగా, బ్రిజ్ భూషణ్ అసభ్య ప్రవర్తనపై రెజ్లర్లు కొన్ని నెలల క్రితమే తమ ఆందోళనను విరమించుకున్నారు.
Maharashtra : మహారాష్ట్రలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్.. భయంతో జనం పరుగులు