British Fighter Jet: దాదాపు నెల రోజులుగా కేరళలోనే యూకే యుద్ధ విమానం.. అధికారుల కీలక నిర్ణయం.. అలా ఫైటర్ జెట్ తరలింపు..!

జెట్ విమానాన్ని హ్యాంగర్‌లోకి తరలించడానికి ఎయిర్ ఇండియా నుండి వచ్చిన ప్రతిపాదనను రాయల్ నేవీ మొదట తిరస్కరించింది.

British Fighter Jet: దాదాపు నెల రోజులుగా కేరళలోనే యూకే యుద్ధ విమానం.. అధికారుల కీలక నిర్ణయం.. అలా ఫైటర్ జెట్ తరలింపు..!

Updated On : July 3, 2025 / 4:42 PM IST

British Fighter Jet: బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన F-35 ఫైటర్ జెట్ జూన్ 14న కేరళలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో ఆ యుద్ధ విమానం ఇక్కడే ఉండిపోయింది. ఈ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని డిస్ మాంటిల్ (సామాగ్రిని పూర్తిగా తొలగించి) చేసి వాయు మార్గంలో యూకే పంపాలని అధికారులు నిర్ణయించారు. UKకి ఎయిర్‌లిఫ్టింగ్ కోసం విడదీయబడవచ్చు.

అది జూన్ 14. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన F-35 ఫైటర్ జెట్‌ అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది. దీంతో దాన్ని పాక్షికంగా విడదీసి, మిలిటరీ కార్గో విమానంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు తిరిగి తరలించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.

యుద్ధ విమానానికి అక్కడికక్కడే మరమ్మతులు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పరిష్కారం కాని ఇంజనీరింగ్ లోపం కారణంగా ఈ ఐదవ తరం స్టెల్త్ జెట్ అక్కడే నిలిచిపోయింది. విమానం తిరిగే ఎగిరేలా ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అధికారవర్గాలు ధృవీకరించాయి.

యుద్ధ విమానం కేరళలో నిలిచిపోయిన ఇన్ని రోజులు అవుతున్నా.. యునైటెడ్ కింగ్‌డమ్ స్పందించలేదు. అక్కడి నుండి ఏ ఇంజనీరింగ్ బృందం ఇంకా భారత్ కు రానే లేదు. ఫైటర్ జెట్ కు మరమ్మతులు చేపట్టడానికి 30మంది ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంటుందని అధికారులు భావించారు. కానీ యూకే నుంచి ఇప్పటివరకు ఆ బృందం మన దేశంలోకి రాలేదని తెలిపాయి.

విమానం రికవరీకి ఎటువంటి సమయం లేకపోవడంతో, బ్రిటిష్ అధికారులు ఇప్పుడు ఆ ఫైటర్ జెట్‌ను తిరిగి పొందడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాక్షికంగా యుద్ధ విమానాన్ని విడదీసి సైనిక రవాణా ద్వారా తీసుకెళ్లడాన్ని బెస్ట్ ఆప్షన్ గా పరిగణిస్తున్నారు.

Also Read: సిలికాన్ వ్యాలీని షేక్ చేస్తున్న సోహమ్ పరిక్.. ఎవరీ కుర్రాడు.. సోషల్ మీడియాలో ఎంటీ రచ్చ?

HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన F-35B, కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, ప్రతికూల వాతావరణం, తక్కువ ఇంధనం కారణంగా తిరువనంతపురం వైపు అత్యవసరంగా మళ్లించబడింది. భారత వైమానిక దళం సురక్షితమైన ల్యాండింగ్‌కు దోహదపడింది. ఇంధనం నింపడంతో పాటు లాజిస్టికల్ సాయం అందించింది.

ఫైటర్ జెట్ తిరిగి బయలుదేరే ముందు తనిఖీల సమయంలో హైడ్రాలిక్ వైఫల్యం బయటపడింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది జెట్ సురక్షితంగా టేకాఫ్, ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముగ్గురు సాంకేతిక నిపుణులతో సహా ఒక చిన్న రాయల్ నేవీ బృందం ఈ లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించింది. కానీ సమస్య సంక్లిష్టత కారణంగా విఫలమైంది.

ఈ విమానాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) రక్షణలో విమానాశ్రయంలోని బే 4 వద్ద నిలిపి ఉంచారు. జెట్ విమానాన్ని హ్యాంగర్‌లోకి తరలించడానికి ఎయిర్ ఇండియా నుండి వచ్చిన ప్రతిపాదనను రాయల్ నేవీ మొదట తిరస్కరించింది. తర్వాత బ్రిటిష్ నేవీ.. జెట్ విమానాన్ని హ్యాంగర్‌లోకి తరలించడానికి అంగీకరించింది.