India – Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్ గురుదాస్‌పుర్‌లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.

Pakistan
India – Pak Border: సరిహద్దు వెంట పాకిస్తాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఉగ్రమూకల డ్రోన్లపై గురిపెట్టిన భారత భద్రతాదళాలు..సరిహద్దు వెంట డ్రగ్స్ సరఫరాపైనా నిఘా ఉంచారు. ఈక్రమంలో భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ ముఠాను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్ గురుదాస్‌పుర్‌లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.
Also read: TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ హాజరైన డీహెచ్
వారు ప్రతిఘటించడంతో కొంతసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భారత దళాలు తీవ్రంగా ప్రతిఘటించి.. పాక్ ముఠాను తరిమికొట్టారు. కాల్పుల సమయంలో ఒక బీఎస్ఎఫ్ జవానుకు గాయాలు అయినట్లు బీఎస్ఎఫ్ డీఐజీ తెలిపారు. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్‌తో పాటు.. 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న చైనీస్ పిస్టల్, ఏకే 47 తుపాకులు, పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం భారత భద్రతా సిబ్బంది చేసుకున్నారు.
Also read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత?