Budhni Mejhan : జ‌వ‌హ‌ర్‌లాల్‌ నెహ్రూ కారణంగా జీవితాంతం బహిష్కరణ ఎదుర్కొన్న గిరిజన మహిళ మృతి

బుధ్నీ మేజాన్ .. భారత తొలి ప్రధాని నెహ్రూ 'గిరిజన భార్య'గా పిలుస్తారు. నెహ్రూ కారణంగా ఆమె జీవితకాలం బహిష్కరణ ఎదుర్కున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. అసలు ఎవరు ఈ బుధ్నీ మేజాన్?

Budhni Mejhan

Budhni Mejhan : భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ‘గిరిజన భార్య’గా ముద్రపడిన బుధ్నీ మేజాన్ తన 80 వ ఏట కన్నుమూసారు. నెహ్రూ కారణంగా ఆమె తన కమ్యూనిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అసలు ఎవరు ఈ బుధ్నీ మేజాన్?

తన కమ్యూనిటీ నుంచి జీవితకాలం బహిష్కరణ ఎదుర్కున్న జవహర్ లాల్ నెహ్రూ ‘గిరిజన భార్య’ బుద్నీ మేజాన్ నవంబర్ 17 న మరణించారు. జార్ఖండ్‌లోని పంచేట్ సమీపంలోని తన ఇంట్లో ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. బుధ్నీ మేజాన్ హార్ట్ అటాక్‌తో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెకు కుమార్తె రత్న (60), మనవడు బాపి (35) ఉన్నారు.‌

PM Narendra Modi: డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

బుధ్నీ మేజాన్‌కు స్ధానికంగా ఉండే రాజకీయ నేతలు, అధికారులు నివాళులు అర్పించారు. పంచేట్ పంచాయతీ భైరవ్ మండల్ చీఫ్ జవహర్ లాల్ నెహ్రూ ‘గిరిజన భార్య’ గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) కి లేఖ రాసారు. ఆమె కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని కోరారు.

జవహర్ లాల్ నెహ్రూ ‘గిరిజన భార్య’ ఎందుకు అంటారు? ఆమెను జీవితకాలం ఎందుకు బహిష్కరించారంటే…

1959 డిసెంబర్ 6 న నెహ్రూ పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆనకట్టను ప్రారంభించేందుకు వెళ్లారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆయనకు స్వాగతం పలికేందుకు 15 సంవత్సరాల బుధ్ని మంజియాన్ అనే గిరిజన బాలికను ఎంపిక చేసింది.

NFL Management Trainee Recruitment 2023 : లక్షకు పైగా వేతనం.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

బుధ్ని మేజాన్ ఎంతో ఉత్సాహంగా నెహ్రూకు స్వాగతం చెప్పేందుకు సిద్ధమైంది. కానీ ఆమెకు అప్పుడు తెలియదు ఆ సందర్భం తన జీవితంలో ఓ పెద్ద మలుపు తీసుకురాబోతోందని. ఆనకట్ట ప్రారంభోత్సవ సమయంలో నెహ్రూ బుధ్నీ మెడలో పూలమాల వేసి ప్రశంసించారు. అదే బుధ్నీ జీవితాన్ని మార్చేసింది. గిరిజన సంప్రదాయాల ప్రకారం బాలిక మెడలో పూలమాల వేస్తే వివాహం అయినట్లుగా భావిస్తారు. బుధ్నీ మెడలో నెహ్రూ పూలమాల వేయడంతో ఆయనతో వివాహమైనట్లుగా.. బుధ్నీని గిరిజనేతర మహిళగా నిర్ధారించి సంతాలీ సంఘం ఆమెను బహిష్కరించింది.

ఆ సమయంలో బుధ్నీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. 1962 లో ఆ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. దాంతో ఆమె జార్ఖండ్‌కు వెళ్లి 7 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు. ఆ తర్వాత తన సన్నిహితుడైన సుధీర్ దత్తాను వివాహం చేసుకోవాలని అనుకున్నారు. సమాజానికి భయపడి పెళ్లి చేసుకోలేకపోయారామె. కానీ ఆయనతో కలిసి జీవించారు.. అలా ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. 1985 లో రాజీవ్ గాంధీ బుధ్నీ గురించి తెలుసుకుని ఆమెను కలిసారు. ఆ సమయంలోనే ఆమెకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో ఉద్యోగం తిరిగి వచ్చింది.

Uttarkashi Tunnel : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల

జవహర్ లాల్ నెహ్రూ హయాంలో ఉచిత విద్యుత్, ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసినా అవేమీ నెరవేరలేదని బుధ్నీ బాధపడేవారట. 2016 లో బుధ్నీ తమ ఆర్ధిక పరిస్థితుల గురించి వివరిస్తూ తనకొక ఇల్లు, కుమార్తెకు ఉద్యోగం ఇప్పించమని రాజీవ్ గాంధీకి సైతం విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. నెహ్రూ కారణంగా తన జీవితంలో ఎదురైన కష్టాల్ని ఆమె గుర్తు తెచ్చుకోకూడదని భావించేవారట. తెలిసో తెలియకో బుధ్నీ మెడలో నెహ్రూ వేసిన పూలమాల నెహ్రూకు ‘గిరిజన భార్య’ గా శాశ్వత ముద్రను వేసింది.