Building Collapsed : ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం

ఢిల్లీలోని కబీర్‌ నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారు జామున కుప్పకూలిపోయింది.

Building Collapsed : ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం

Building Collapse

Delhi Building Collapse : ఢిల్లీలోని కబీర్‌ నగర్‌  ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో కుప్పకూలిపోయింది. భవనం కూలిన సమయంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. ఆరుగురు కార్మికులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అర్షద్ (30), తౌహీద్ (20) లు చికిత్స పొందుతూ మృతిచెందగా.. రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Sadhguru Jaggi Vasudev : సద్గురుకు బ్రెయిన్‌లో బ్లీడింగ్‌.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో సర్జరీ.. ఇషా ఫౌండేషన్ ప్రకటన!

భవనం కూలిన సమయంలో అందులో 13మంది వరకు పనిచేస్తున్నారని డీసీపీ రాజేష్ డియో తెలిపారు. భవన నిర్మాణంకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిన ఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీయడం జరిగిందని చెప్పారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారన్నారు.