IRCTC టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ : సమ్మర్‌లో మ్యారేజీ, హాలీడే ట్రిప్‌కు వెళ్తున్నారా?  

సమ్మర్ సీజన్ లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ-టికెట్ బుకింగ్ ఫేసిలిటీని సులభతరం చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఈ తరహా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Published By: sreehari ,Published On : March 16, 2019 / 08:07 AM IST
IRCTC టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ : సమ్మర్‌లో మ్యారేజీ, హాలీడే ట్రిప్‌కు వెళ్తున్నారా?  

సమ్మర్ సీజన్ లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ-టికెట్ బుకింగ్ ఫేసిలిటీని సులభతరం చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఈ తరహా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సమ్మర్ హాలీడ్ ట్రిప్, ఫ్యామిలీతో కలిసి వెడ్డింగ్ పార్టీలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్ టీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే క్షణం.. ఆగండి.. ఇంతకీ మీరు ఎంతమంది వెళ్తున్నారు. ముందే లెక్క చెప్పండి.. సాధారణంగా ఐఆర్ టీసీ లో ఒకేసారి ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంది. ఆరుగురి కంటే ఎక్కుమంది ఒకేసారి టికెట్ బుక్ చేయాలంటే కుదరదు. సమ్మర్ సీజన్ లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ-టికెట్ బుకింగ్ ఫేసిలిటీని సులభతరం చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఈ తరహా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also : SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా

అదే.. బల్క్ బుకింగ్.. (పార్టీ బుకింగ్) అని కూడా అంటారు. బల్క్ బుకింగ్ సిస్టమ్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. బల్క్ ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.. బల్క్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా ఒకేసారి (పదులు, వందల సంఖ్యలో) గ్రూపు సభ్యులంతా రైల్లో ట్రావెల్ చేయొచ్చు. హాలీడే ట్రిపులు, అఫిషియల్ టూర్స్, మ్యారేజీ పార్టీలు, ఎడ్యుకేషన్ టూర్స్, రిలీజియస్ గ్రూపులు..ఇతా ప్రతి గ్రూపు ఒకేసారి ట్రైన్ లో ట్రావెల్ చేసేందుకు ఈ బల్క్ బుకింగ్ విధానం ఎంచుకోవచ్చు. 

బల్క్ టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే? 
1. బల్క్ బుకింగ్ రిజర్వేషన్ ప్రకారం.. 50 మంది ప్రయాణికులకు అనుమతి ఉంటుంది. వీరంతా CRS(చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ లేదా షిప్ట్ ఇంఛార్జ్) కేటగిరీ కింద యాభై మంది ఒకేసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. 100 మంది వరకు ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే మాత్రం ఏరియా (మేనేజర్/ఏటీఎం/ఏసీఎం/ఎస్ఎం) అనుమతితో మాత్రమే వీలు పడుతుంది. అదే.. వంద మందికి పైగా గ్రూపు సభ్యులు ఒకేసారి టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే సీనియర్ డీసీఎం/డీటీఎం లేదా ఏరియా మేనేజర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ట్రైన్ లో ఉన్న సీట్ల పరిమితి ఆధారంగా దాదాపు 25 శాతం మాత్రమే బుకింగ్ రిజర్వేషన్ కు అనుమతిస్తారు.  
Read Also :PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

2. ప్రస్తుతానికి బల్క్ బుకింగ్ సిస్టమ్ న్యూఢిల్లీలోని రిజర్వేషన్ కాంప్లెక్స్ లోని IRCA భవనంలో ఉంది. ఈ సర్వీసు నామినేటేడ్ కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర నగరాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో బల్క్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. బల్క్ బుకింగ్ చేసుకోవాలనేవారు ముందుగా వారు వెళ్లే రైల్వే స్టేషన్ లో ఈ ప్రాసెస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 

3. సాధారణ సిటిజన్స్ ఆన్ లైన్ ద్వారా బల్క్ బుకింగ్ చేసేందుకు ఐఆర్ సీటీసీ అనుమతించదు. చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్స్ అనుమతి ఉంటేనే IRCTC వెబ్ సైట్ ద్వారా బల్క్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు రిజర్వేషన్ చేసే సదరు వ్యక్తి సంబంధిత పత్రాలను రైల్వే స్టేషన్ కౌంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది. అక్కడి అధికారులు అనుమతి ఇస్తేనే బల్క్ బుకింగ్ చేసేందుకు వీలు ఉంటుంది. 

4. బల్క్ బుకింగ్ రిజర్వేషన్ కోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నాక.. రిక్వెస్ట్ లెటర్ కూడా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్వెస్ట్ లెటర్ తోపాటు స్కూల్/డిపార్ట్ మెంట్/ఇన్స్ సిట్యూషన్ ఇలా ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని జతపరచాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యారేజీ పార్టీ, ఫ్యామిలీ ఫంక్షన్ అయితే పెళ్లి శుభలేఖను నోటరైజ్ అఫడవిట్ ను రిక్వెస్ట్ లెటర్ తో పాటు అధికారులకు అందించాల్సి ఉంటుంది.  

5. ఈ డ్యాకుమెంట్లతో పాటు గ్రూపు సభ్యుల్లో ఎంతమంది వెళ్తున్నారు. వారి పేర్లు, వయస్సు, ఆడ లేదా మగ, చిన్న పిల్లలు ఇలా అన్ని విషయాలను తెలియజేయాలి. దీనికి సంబంధించిన జాబితాను కూడా ఇవ్వాలి. అంతేకాకుండా.. ఎవరైతే బల్క్ బుకింగ్ రిజర్వేషన్ చేస్తున్నారో సదరు వ్యక్తి గుర్తింపు కార్డు వివరాలను జత చేయాల్సి ఉంటుంది. 

6. బల్క్ బుకింగ్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ ఉదయం 10:00 గంటల తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుంది. టికెట్ రిజర్వేషన్ చేసే సమయానికి మీరు వెళ్లాల్సిన ట్రైన్ లో సీట్ల పరిమితి బట్టి తర్వాతి ప్రాసెస్ ఉంటుంది. 

7. రిక్వెస్ట్ లెటర్ ను సంబంధిత అధికారులకు ఇచ్చే ముందు వెళ్లే ట్రైన్ నెంబర్, ఏ తేదీలో వెళ్తున్నారు.. ఎంతమంది ప్రయాణికులు వెళ్తున్నారు.. జాబితా మొత్తాన్ని దీనికి జత చేయాలి. 

8. ఇండియన్ రైల్వే గైడ్ లైన్స్ ప్రకారం.. బల్క్ బుకింగ్ సిస్టమ్ ఉదయం 8:00 నుంచి 9:00 గంటల ప్రాంతంలో అనుమతించరు. ఈ సమయాల్లో బల్క్ బుకింగ్ రిజర్వేషన్ చేయరాదు. 

9. ఫైనల్ ప్రాసెస్ లో భాగంగా అధికారులు మీ రిక్వెస్ట్ లెటర్ ను ఆమోదించాలంటే.. గ్రూపు సభ్యుల వివరాలు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. వారి పేర్లు, వయస్సు, వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలు.. మూడు కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. 

10. అంతా పూర్తి అయింది.. మీ రిక్వెస్ట్ లెటర్ ను అధికారులు ఆమోదించారు.. బల్క్ టికెట్ బుకింగ్ రిజర్వేషన్ ప్రాసెస్ పూర్తయింది. గ్రూపు సభ్యుల్లో ఎవరి పేరు అయిన మార్చాల్సి వస్తే.. ఓ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా.. స్టేషన్ నుంచి రైలు బయల్దేరేందుకు 48 గంటల ముందే ఈ ప్రాసెస్ పూర్తి కావాలి. ఈ అప్లికేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెట్/గ్రూపు/పార్టీ సంబంధిత వ్యక్తలు స్వయంగా అప్లికేషన్ రాసి ఇవ్వాలి. ఈ రిక్వెస్ట్ ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. 
Read Also : మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..