Jammu Kashmir Accident : జమ్మూ కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి

జమ్మూ కశ్మీర్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 250 అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 36మంది ప్రాణాలు కోల్పోయారు.

Jammu Kashmir Accident : జమ్మూ కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి

Jammu kashmir

Jammu Kashmir Bus Accident : జమ్మూ కశ్మీర్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 250 అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు ప్రమాదం సమయంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

Also Read : Rajasthan : 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఆ దేవుడి ప్రసాదం .. దీని వెనుక ఆసక్తికర కారణం..

జమ్మూలోని డోడా జిల్లాలో బటోత్ – కిష్త్వాడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను డోడాతో పాటు కిష్వ్తాడ్ జనరల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. డోడాలో బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

బస్సు ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. మరోవైపు ఘటన స్థలిలో పోలీసులు, రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.