ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

Assembly Bye Elections

Updated On : June 10, 2024 / 12:40 PM IST

Assembly Bye Elections: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10న ఈ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నామినేషన్ కు చివరి తేదీ జూన్ 21 కాగా, జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ జూన్ 26గా నిర్ణయించింది. జూలై 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

Also Read : ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరణ.. రైతుల ఫైలుపై తొలి సంతకం

ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
బీహార్ రాష్ట్ర (రూపాలి నియోజకవర్గం), పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ( రాయ్ గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మాణిక్తలా), తమిళనాడు రాష్ట్ర (విక్రవాండి), మధ్యప్రదేశ్ రాష్ట్రం (అమరవాడ), ఉత్తరాఖండ్ రాష్ట్రం (బద్రీనాథ్, మంగళూరు), పంజాబ్ రాష్ట్రం (జలంధర్ వెస్ట్), హిమాచల్ ప్రదేశ్ (డెహ్రా, హమీర్పూర్, నలగర్) అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10న పోలింగ్ జరగనుంది.