Byjus laysoff 2023: బైజూస్ నుంచి మరో వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు.. కారణమేమంటే?

ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన విషయం విధితమే. తాజాగా మరో వెయ్యి మందిని తొలగిస్తూ బైజూస్ కంపెనీ నిర్ణయించింది.

Byjus laysoff 2023: బైజూస్ నుంచి మరో వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు.. కారణమేమంటే?

byjus layoffs

Updated On : June 20, 2023 / 9:47 AM IST

Byjus laysoff 2023: భారతదేశంలోని అతిపెద్ద ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ (Byjus) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. సంస్థలో పనిచేసే వెయ్యి మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తాజాగా ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో.. కంపెనీలో మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3,500కు పెరగనుంది. ఉద్యోగుల తొలగింపుకు కంపెనీ ఆర్థిక పరిస్థితులతో పాటు, అమెరికాలో రుణదాతలతో న్యాయ పోరాటానికి దిగిన తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, కంపెనీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. తొలగించిన వారికి రెండు నెలల జీతం ఇవ్వనున్నట్లు తెలిసింది.

Byju’s Online Company : బైజూస్ ఆన్ లైన్ సంస్థ, రవీంద్రన్ బైజూ ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

2023 మార్చి నాటికి లాభదాయకంగా మారాలన్న కంపెనీ ప్రణాళికలో భాగంగా 2022 అక్టోబర్ నెల నుంచి ఆరు నెలల్లో పలు దఫాలుగా 2,500 మంది ఉద్యోగులను బైజూస్ తొలగించింది. తాజాగా ఉద్యోగాలనుంచి తొలగిస్తున్న వారికి కంపెనీ హెచ్‌ఆర్ విభాగం నుంచి ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈదఫా కంపెనీలోని దాదాపు అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు పడినట్లు సమాచారం. అయితే, జూన్ 16వ తేదీన తొలగించిన ఉద్యోగులకు చివరి తేదీగా కంపెనీ నుంచి సమాచారం ఇచ్చినట్లు పలువురు ఉద్యోగులు తెలిపారు.

Byju Raveendran: ఆమె ఎక్కువగా ప్రశ్నించేది.. తన స్టూడెంట్‌తో ప్రేమ ఎలా ప్రారంభమైందో చెప్పిన బైజు సీఈఓ రవీంద్రన్

ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన విషయం విధితమే. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ విభాగాలకు చెందిన ఉద్యోగులను కంపెనీ తొలగించింది. అయితే, చాలాకాలంగా బైజూస్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది నుంచి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎడ్టెక్ స్టార్టప్ ఖర్చును తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. బైజూస్ ద్వారా ఉద్యోగుల ఉపసంహరణకూడా ఈ ప్రణాళికలో ఒక భాగం. డిజిటల్ కె-12 (కిండర్ గార్డెన్ నుండి 12వ తరగతి వరకు) విద్యా వ్యాపారం కోసం కొత్త కస్టమర్లను పొందడం సంస్థకు కష్టంగా మారుతోంది.