ఒకేరోజు ఢిల్లీ హైకోర్టు 2 తీర్పులు.. జడ్జిని బట్టే న్యాయం మారుతుందా

ఒకేరోజు ఢిల్లీ హైకోర్టు 2 తీర్పులు.. జడ్జిని బట్టే న్యాయం మారుతుందా

Updated On : February 28, 2020 / 5:34 AM IST

ఢిల్లీ ఆందోళనలపై అర్ధరాత్రి విచారణ జరిపిన జడ్జిని ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేసేశారు. ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన జడ్జి ట్రాన్సఫర్ అయ్యారు. మరి తర్వాత వచ్చిన జడ్జి అరెస్టు చేయడానికే మూడు రోజుల సమయం తీసుకొమ్మని చెప్పడమేంటి? జడ్జిని బట్టి న్యాయం మారుతుందా.. 24గంటల కాల వ్యవధిలోనే హైకోర్టు నుంచి రెండు తీర్పులా.. 

హర్ష మందర్ అనే వ్యక్తి ఢిల్లీ ఆందోళనలపై విచారణ జరపాలంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రాజకీయనేతలపై ఫిర్యాదు చేశాడు. జస్టిస్‌లు డా.ఎస్ మురళీధర్, తల్వాంత్ సింగ్‌ల బెంచ్‌లు బుధవారం అర్ధరాత్రి విచారణ జరిపారు. పరిస్థితి అదుపు తప్పుతుందని అర్జెంట్ గా విచారణ చేపట్టాలని జస్టిస్ మురళీధర్ పేర్కొన్నారు. 

అప్పుడు జరిగిందేంటంటే:
సొలిసిటర్ జనరల్: ఇది అంత అర్జెంట్ మ్యాటర్ అవుతుందా.. ఈ టైంలో విచారణ అవసరమా

జస్టిస్ మురళీధర్..: వందల మంది అక్కడ జరిగిన ఘటనను వీడియోల రూపంలో చూస్తున్నారు. అయినా అర్జెంట్ అనిపించడం లేదా

సొలిసిటర్ జనరల్: ఎఫ్ఐఆర్ సరైన టైంలోనే ఫైల్ చేయాలి. లేదంటే పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేం. 

జస్టిస్ మురళీధర్..: సరైన టైం ఏంటి మెహతా.. మీకు ఒక్క రోజు గడువిస్తున్నా.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ద్వేష పూరిత వ్యాఖ్యలుచేసిన వారిని అరెస్టు చేయాలి. 

ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో చేసే ఒక్కొక్క రోజు జాప్యం.. అంత తీవ్రంగా మారుతుంది. ఆలస్యం జరుగుతున్న కొద్దీ సమస్య పెరుగుతూనే ఉంటుంది. అని జస్టిస్ మురళీధర్ హెచ్చరించారు. 

గురువారం ఏం జరిగింది:
చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సీ హరిశంకర్‌ల అధ్యక్షతన మరో బెంచ్ ఏర్పాటు అయింది. సీజే పటేల్ ఆధ్వర్యంలో జరగాల్సిన విచారణ ఆయన సెలవులో ఉండటంతో జస్టిస్ మురళీధర్ నేతృత్వంలో జరిగింది. ఇవాళ్టి బెంచ్‌కు ఎటువంటి ఎమర్జెన్సీ లేదు. 

స్పీచ్‌లను పట్టించుకోవద్దని బెంచ్ సూచించింది. మరోసారి సొలిసిటర్ జనరల్.. స్పీచ్‌ల గురించి ప్రస్తావించినప్పటికీ ఆ స్పీచ్‌లు అయితే ఏంటని ప్రశ్నించింది బెంచ్. ఒక్క రోజులో అరెస్టును పొడిగిస్తూ నాలుగు రోజులు కేటాయించింది. వీడియోలను సేకరించి, ఇంకా అవసరమైన సాక్ష్యాల ఆధారంగా అరెస్టు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

Also Read | ఢిల్లీ అల్లర్లలో 2,000 కేజీల ఇటుకలతో దాడులు.. రోడ్లన్నీ అస్తవ్యస్తం!

బెంచ్ ఈ సబ్‍‌మిషన్ రికార్డు చేయడమేకాక, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసుకునేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఇప్పుడీ సంగతిని ఏప్రిల్ 13కు పొడిగించారు. ఒక బెంచ్ ఎఫ్ఐఆర్ కోసం 24గంటల సమయం తీసుకుంటే మరో బెంచ్ 4వారాల సమయం తీసుకుంది. సీనియర్ అడ్వకేట్ కొలిన్ గాన్‌స్లేవ్స్.. ప్రజలు రోజూ ప్రాణాలు కోల్పోతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.