PUBGకి పోటీగా కొత్త గేమ్ : అక్టోబర్ 1న విడుదల

ఆన్ లైన్ గేమ్ PUBGకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. అంతేకాదు ఈ గేమ్ కి బానిసలైపోయి కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నం కూడా తినడం మానేసి గేమ్ ఆడుతున్నారు. అందుకని PUBG గేమ్ ని భారత్ లో నిషేధించమని డిమాండ్లు చేస్తున్న సమయంలో దీనికి పోటీగా ఇప్పుడు మరో కొత్త గేమ్ ను విడుదల చేయబోతున్నారట.
వివరాలు.. గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్ PUBG మొబైల్ కు పోటీగా కాల్ ఆఫ్ డ్యూటీ అనే కొత్త గేమ్ ను అక్టోబర్ 1న అధికారికంగా విడుదల చేయనుంది. అందుకుగాను ఆ కంపెనీ PUBG మొబైల్ డెవలపర్ టెన్సెంట్ గేమ్స్ తో కలిసింది. ఈ గేమ్ కూడా అచ్చం PUBG లాగానే ఉంటుంది. ఇక ఈ గేమ్ ఆండ్రాయిడ్, IOS ప్లాట్‌ఫాంలపై యూజర్లకు ఉచితంగా లభిస్తోంది. ఈ గేమ్‌కు ప్రీ రిజిస్ట్రేషన్లను ఇప్పటికే ప్రారంభించారు.