Arvind Kejriwal
Arvind Kejriwal ED : మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేయగా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే గురువారం దర్యాప్తు అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు ఆరోపించారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను పోలీసు వర్గాలు తోసిపుచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్టు చేయవచ్చా? ఎలాంటి కేసులు నమోదైతే అరెస్టు చేయ్చొచ్చు అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు 4వసారి ఈడీ సమన్లు
సివిల్ ప్రొసీజర్ కోడ్ 135 ప్రకారం ముఖ్యమంత్రి, శాసన మండలి అరెస్టు నుంచి మినహాయింపు కలిగి ఉంటుంది. అయితే, ఈ మినహాయింపు శాసన వ్యవహారాల్లో మాత్రమే. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభ్యునిపై ఏదైనా క్రిమినల్ కేసు నమోదైతే, సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద అరెస్టుచేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడకూడా ఒక నియమం వర్తిస్తుంది. అది అసెంబ్లీ స్పీకర్ ఆమోదం పొందాలి. చట్టం ప్రకారం సీఎంను అరెస్టు చేయాలంటే ముందుగా సభాపతి అమోదం తప్పనిసరి, ఆమోదం పొందిన తరువాతే ముఖ్యమంత్రిని అరెస్టు చేయొచ్చు.
సెక్షన్ 135 ప్రకారం.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే 40రోజుల ముందు, సమావేశాలు ముగిసిన 40 రోజుల తరువాత ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభ్యుడిని అరెస్టు చేయరాదు. అదే సమయంలో ముఖ్యమంత్రిని, ఏ అసెంబ్లీ సభ్యుడినైనా హౌస్ నుంచి అరెస్టు చేయలేరు. అదేవిధంగా.. నిందితులు ఏ పదవుల్లో ఉండగా అరెస్టు చేయలేరంటే.. ఆర్టికల్ 61 ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్ ను పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయరాదు. చట్టం ప్రకారం, ఈ అరెస్టు సివిల్, క్రిమినల్ రెండింటిపై ఎలాంటి అభియోగంపై చేయరాదు. రాష్ట్రపతి, గవర్నర్ తమ పదవులకు రాజీనామా చేస్తే అరెస్టు చేయొచ్చు.