Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు 4వసారి ఈడీ సమన్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పేర్కొంది....

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు 4వసారి ఈడీ సమన్లు

Delhi CM Arvind Kejriwal

Updated On : January 4, 2024 / 11:54 AM IST

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నివాసంపై ఈడీ దాడి చేసి గురువారం ఆయనను అరెస్టు చేస్తుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈడీ ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో సమన్లకు ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

ALSO READ : Ayodhya Ram temple : అయోధ్య రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములకు ఆహ్వానం

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించి గురువారం అరెస్టు చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సహా ఆప్ నేతలు ఆరోపించారు. ఆప్ నేతల వాదనలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. కేజ్రీవాల్ నివాసంపై గురువారం సోదాలు జరపాలని లేదని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ కు మూడు సమన్లు జారీ చేశారు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ ఐదు పేజీల సమాధానాన్ని సీఎం పంపించారు.

ALSO READ : Ram Temple : రామాలయం, యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపు

జనవరి 6 నుంచి 8 తేదీల మధ్య కేజ్రీవాల్ మూడు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లనున్నట్లు ఆప్ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం సివిల్ లైన్స్‌లోని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల భద్రతా సిబ్బందిని మోహరించారు. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లే రహదారులను ఢిల్లీ పోలీసులు బ్లాక్ చేశారని ఆప్ పేర్కొంది. ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.