Ayodhya Ram temple : అయోధ్య రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములకు ఆహ్వానం

పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములను శ్రీ రామతీర్థ ట్రస్టు ఆహ్వానించింది. 36 ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణంలో సీతారాములుగా దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ లు నటించారు....

Ayodhya Ram temple : అయోధ్య రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములకు ఆహ్వానం

Ramayan actor Dipika Chikhlia, Arun Govil

Updated On : January 8, 2024 / 12:23 PM IST

Ayodhya Ram temple : పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములను శ్రీ రామతీర్థ ట్రస్టు ఆహ్వానించింది. 36 ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణంలో సీతారాములుగా దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ లు నటించారు. అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణం సీరియల్ అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమైంది. జనవరి 22వతేదీన అయోధ్యలో జరగనున్న రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములు పాల్గొంటారని ఆలయ కమిటీ పేర్కొంది.

ALSO READ : Ram Temple : రామాలయం, యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపు

రామానంద్ సాగర్ రామాయణంలో దీపికా చిక్లియా సీతాదేవిగా నటించింది.ఈ వేడుకకు తనను ఆహ్వానించినట్లు దీపిక ధృవీకరించారు. దూరదర్శన్‌లో 78 ఎపిసోడ్‌లను విస్తరించిన క్లాసిక్ టెలివిజన్ షోలో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ దీపికతో కలిసి పాల్గొనే అవకాశం ఉంది. తాను చారిత్రక కార్యక్రమంలో పాల్గొంటానని దీపిక చెప్పారు. రామాయణంలో సీతాదేవిగా నటించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని దీపిక చెప్పారు.

ALSO READ : Lok Sabha polls : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్‌కు కీలక పదవి

తాను సీతాదేవిగా నటనను ఆద్యంతం ఆస్వాదించానని చెప్పారు. అయోధ్యతోపాటు ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని స్వాగతించాలని దీపిక కోరారు. 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయాన్ని జనవరి 22వతేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ALSO READ : Iran blasts: ఇరాన్‌లో జంట పేలుళ్లు…103మంది మృతి

ఈ కార్యక్రమంలో దీపికా ఛిఖ్లియా, అరుణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, సంజయ్ లీలా బన్సాలీ, చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్, రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారని ఆలయ కమిటీ అధికారులు చెప్పారు.