Ram Temple : రామాలయం, యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపు
అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు....

Ram Temple, Yogi Adityanath
Ram Temple : అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరినీ యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూపీ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసిన వారి పేర్లు తహద్ సింగ్, ఓంప్రకాష్. జుబేర్ అనే హ్యాండిల్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది. నిందితులిద్దరూ గోండా వాసులని పోలీసులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం లక్నోలోని గోమతి నగర్‌లోని విభూతి ఖండ్ ప్రాంతానికి చెందిన తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాను అరెస్టు చేసింది.
ALSO READ : Lok Sabha polls : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్‌కు కీలక పదవి
ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ వేరే పేర్లతో ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. వీరిద్దరూ పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని సమాచారం. అయోధ్యలో రామాలయం ప్రారంభించనున్న నేపథ్యంలో పేల్చివేస్తామని బెదిరింపులు రావడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.