Arvind Kejriwal : ఢిల్లీ మద్యం స్కాంలో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్నారా? అప్రమత్తమైన ఆప్ నేతలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడి జరిపిన తర్వాత గురువారం ఉదయం అరెస్టు చేయవచ్చనే వార్తలు సంచలనం రేపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎక్స్ లో పోస్టు చేశారు...

Arvind Kejriwal : ఢిల్లీ మద్యం స్కాంలో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్నారా? అప్రమత్తమైన ఆప్ నేతలు

Arvind Kejriwal,Atishi

Updated On : January 4, 2024 / 5:16 AM IST

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడి జరిపిన తర్వాత గురువారం ఉదయం అరెస్టు చేయవచ్చనే వార్తలు సంచలనం రేపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎక్స్ లో పోస్టు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆప్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ALSO READ : Iran blasts: ఇరాన్‌లో జంట పేలుళ్లు…103మంది మృతి

మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర ఏజెన్సీ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని అధికారులు కేజ్రీవాల్‌ను మూడుసార్లు ప్రశ్నించడానికి పిలిచారు. ‘‘గురువారం ఉదయం అర్వింద్ కేజ్రీవాల్ నివాసంపై ఈడీ దాడి చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. అరెస్టు చేసే అవకాశం ఉంది’’ అని పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆప్ పార్టీ సీనియర్ నేతలు సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా, సందీప్ పాఠక్ హ్యాండిల్స్‌పై కూడా ఇలాంటి పోస్ట్‌లు కనిపించాయి.

ALSO READ : శ్రీకాకుళం పార్లమెంట్ సీటుపై వైసీపీ గురి.. బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ

కేజ్రీవాల్ మూడుసార్లు విచారణ కోసం ఈడీ జారీ చేసిన సమన్లను దాటవేశారు. నవంబర్ 2,డిసెంబర్ 21 తేదీల్లో ఈడీ ముందు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ పై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయవచ్చని ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో సీఎంను నిందితుడిగా పేర్కొనలేదు.

ALSO READ : మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి, చాలా బాధగా ఉందంటూ భావోద్వేగం

తనకు ఈడీ సమన్లు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని, జాతీయ ఎన్నికలలో ప్రచారం చేయకుండా తనను ఆపాలని బీజేపీ యోచిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ కటకటాల్లో ఉన్నారు. అరెస్ట్ చేసినా కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, జైలు నుంచే తన పని తాను చేసుకుపోవాలని కూడా ఆప్ నేతలు కోరుకుంటున్నారు.